Home ఆంధ్ర ప్రదేశ్ ఆ అధికారికి షాక్ ఇచ్చిన ఎంపీ రఘురామ కృష్ణరాజు..కేసులో మరో ట్విస్ట్

ఆ అధికారికి షాక్ ఇచ్చిన ఎంపీ రఘురామ కృష్ణరాజు..కేసులో మరో ట్విస్ట్

162
0
YSRCP MP Raghurama Krishnama Raju Reaction On CID Additional DG
YSRCP MP Raghurama Krishnama Raju Reaction On CID Additional DG

ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ ను విమర్శిస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజుపై రాజద్రోహం కేసు మోపబడిందన్న సంగతి తెలిసిందే. ఆ కేసులో ఎంపీ రఘురామ కృష్ణరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో తనను చిత్రహింసలకు గురిచేసిన సీఐడీ అధికారులపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫైర్ అవుతున్నారు. వారికి షాకుల మీద షాక్ లు ఇస్తూ దూసుకెళ్తున్నారు. తనను అరెస్ట్‌ చేసిన సంగతిపై ఇప్పటికే ఎన్‌హెచ్ఆర్‌సీతో పాటు లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు ఎంపీ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు లీగల్ నోటీసులు పంపడం జరిగింది. ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి కస్టడీకి తీసుకునే సమయంలో ఆయన దగ్గర ఉన్న వస్తువులను ఇంకా ఇవ్వలేదని, వెంటనే ఆ వస్తువులను మెజిస్ట్రేట్ ముందు ఉంచాలని ఆయన నోటీసులు జారీ చేశారు.

ఎంపీ రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ..తన స్మార్ట్ ఫోన్ లో ఎంతో విలువైన వివరాలు ఉన్నాయని, అందుకే మొబైల్ ను ఓపెన్ చేసి చూపించమని పోలీసులు తనను చిత్రవధ చేసినట్లుగా ఆరోపించారు. రాజద్రోహం కేసులో బయటపడిన ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌లోని ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలోనే ఉన్నారు. గత కొన్ని రోజులకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆయన కలిశారు. గుంటూరు పోలీసులు తనను హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసేందుకు కుట్ర చేశారని ఆరోపిస్తూ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleపెన్షన్ ల విషయం లో మరో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
Next articleనటి జుహీ చావ్లాపై హైకోర్టు ఫైర్..రూ.20 లక్షల జరిమానా