Home ఆంధ్ర ప్రదేశ్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..జగనన్న కాలనీ పధకం ప్రారంభం

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..జగనన్న కాలనీ పధకం ప్రారంభం

215
0
YSR Jagananna colonies Construction starts from today onward
YSR Jagananna colonies Construction starts from today onward

నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ల పథకానికి శ్రీకారం చుట్టనుంది. మొదటి దశలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ గురువారం రాష్ట్రవ్యాప్తంగా 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది. మూడు విభాగాలుగా గృహ నిర్మాణ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఆయా ఐచ్ఛికాల ఎంపికను లబ్ధిదారులకే వదిలేసింది.

YSR Jagananna colonies starts from today onward

తొలిదశలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీలు’ పేరిట ప్రభుత్వం నిర్మిస్తుంది. సొంతగా కట్టుకునే ఇళ్లు కట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. సొంత స్థలాలు ఉండి ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి కొనుగోలు, కూలీల ఖర్చు కింద ప్రభుత్వం తన వాటా భరిస్తుంది. ఇలాంటి వారు 4.33 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. జగనన్న కాలనీల్లో ఒకే రకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మించనుంది. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్‌ ట్యాంకును ఏర్పాటు చేయనున్నారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleశుభవార్త..భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
Next articleVirat Kohli Predection: టీమిండియా భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్..