Home తెలంగాణ షర్మిల కొత్త పార్టీ పేరు వెల్లడి..అధ్యక్షుడు ఎవరంటే

షర్మిల కొత్త పార్టీ పేరు వెల్లడి..అధ్యక్షుడు ఎవరంటే

176
0
YS Sharmila Announced New Party Name
YS Sharmila Announced New Party Name

తెలంగాణలో రాజకీయ సందడి నెలకొంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతోందని తెలియగానే చాలా మంది అలర్ట్ అయ్యారు. గత ఏడాది డిసెంబర్ నుంచే షర్మిల పార్టీ స్థాపనకు అడుగులు వేసింది. అప్పటి నుంచి వైఎస్ షర్మిల పెట్టబోతున్న పార్టీ పేరు ఏంటి, జెండా ఏంటి అంటూ అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏంటో తెలిసింది. పార్టీ పేరు వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ(వైటీపీ) గా రిజిస్టర్ అయ్యింది. 

వైఎస్ షర్మిల కుటుంబానికి దగ్గర బంధువు అయిన రాజగోపాల్ చైర్మన్ గా వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ పేరును రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇందుకోసం గత సంవత్సరం డిసెంబరులోనే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గురువారం ఎన్నికల సంఘం కొత్త పార్టీల పేరును నమోదు చేసింది. వైటీపీకి ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ సుధీర్ కుమార్, కోశాధికారిగా నూకల సురేష్ ఉంటున్నట్లుగా ఎన్నికల సంఘానికి తెలిపారు.

ఈసీ నుంచి ప్రకటన వచ్చిన తర్వాత వైఎస్ షర్మిలను అధ్యక్షురాలుగా ఎన్నకోనున్నారు. అయితే వైఎస్ చనిపోయిన రోజు అయిన జూలై 8వ తేదిన వైఎస్ జయంతి రోజు షర్మిల తమ పార్టీ పేరు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఒలింపిక్స్‌​ క్రీడల సంసిధ్దతపై మోదీ సమీక్ష..దేశం నుంచి ఎంతమంది బరిలోకి దిగుతున్నారంటే.
Next articleఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా