Home క్రీడలు క్రికెట్ చరిత్రలోనే ఇదొక చెత్త రికార్డ్..20 ఓవర్లలో ఒకే ఫోర్

క్రికెట్ చరిత్రలోనే ఇదొక చెత్త రికార్డ్..20 ఓవర్లలో ఒకే ఫోర్

223
0
Worst Record In Cricket History
Worst Record In Cricket History

టీ20 అంటే చాలా మందికి ఇష్టం. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. మ్యాచ్ బాగా ఆడుతుంటే ప్రేక్షకులు, క్రీడాభిమానులు వీలలు వేస్తూ కేరింతలు కొడుతారు. అదే మ్యాచ్ సరిగా ఆడకుండా ఉంటే ఇక వారు అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త టీ20 మ్యాచ్ జరిగింది. 20 ఓవర్లలో కేవలం ఒక ఫోర్ కూడా ఆ మ్యాచ్ లో కొట్టకపోవడంతో ఆ మ్యాచ్ రికార్డుకెక్కింది. ఆఫ్రికన్ గడ్డపై జరిగిన 20 ఓవర్ల మ్యాచ్ లో ఒక జట్టు ఒక బౌండరీని మాత్రమే సాధించింది. 10 మంది బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ చేసి ఒక్క ఫోర్ మాత్రమే కొట్టారు. నైజీరియా ఉమెన్ వర్సెస్ నమీబియా మధ్య ఆడిన మహిళల టి 20 మ్యాచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఈ టీ20 క్రికెట్ మ్యాచ్ రువాండా పిచ్‌లో జరిగింది. ఇందులో నైజీరియా జట్టు బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 52 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో జట్టు నుంచి ఒక బౌండరీ మాత్రమే వచ్చింది. ఆశ్చర్యకరంగా నైజీరియాకు చెందిన ప్రతి బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడటానికి చాలా కష్టపడుతున్నట్లు కనిపించింది. కానీ డబుల్ ఫిగర్ ను దాటడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు. నైజీరియా జట్టులో అతిపెద్ద స్కోరు 7 పరుగులు, ఆ జట్టు కెప్టెన్ చేసింది. ఆమెతో పాటు మరొకరు 7 పరుగులు చేశారు. ఇద్దరు బ్యాట్స్ మెన్ ఖాతా తెరవలేదు. మరో ఇద్దరు 3-3 పరుగులు సాధించారు. అదే సమయంలో మిగిలిన ఇద్దరు 2-2 పరుగులు చేశారు. 

అయితే ఒక బ్యాట్స్ మెన్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 6 పరుగులు చేసిన ఈ బ్యాట్స్‌మన్ ఖాతాలో ఒక బౌండరీ వచ్చింది. నైజీరియా బ్యాట్స్‌మెన్‌ల గణాంకాలను పరిశీలిస్తే అది స్కోరు బోర్డు కాదు ఒకరి మొబైల్ నంబర్ అనిపించింది. అదృష్టవశాత్తూ నమీబియా జట్టు అదనంగా వారికి 19 పరుగులు సమర్పించింది. ఈ కారణంగా స్కోరు బోర్డు 50 పరుగులు దాటింది. ఈ మ్యాచ్‌లో 18 ఏళ్ల నమీబియా బౌలర్ విక్టోరియా హమునెలా 4 ఓవర్లలో 8 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. అయితే నమీబియా 53 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. 2 వికెట్లు కోల్పోయి కేవలం 56 బంతుల్లోనే ఈ పనిని పూర్తి చేశారు. 64 బంతుల్లో 8 వికెట్ల తేడాతో నమీబియా ఈ మ్యాచ్ గెలిచింది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleసిఎం జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు ఎప్పటివరకంటే?
Next articleవ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రానిదే : ప్రధాని మోదీ