Home Technology ఈ మధ్య కాలంలో వాట్సాప్ తీసుకొచ్చిన బెస్ట్ ఫీచ‌ర్లు ఇవే

ఈ మధ్య కాలంలో వాట్సాప్ తీసుకొచ్చిన బెస్ట్ ఫీచ‌ర్లు ఇవే

150
0
whatsapp New Features
whatsapp New Features

whatsapp New Features:

whatsapp New Features: ప్ర‌తి ఒక్క‌రి మొబైల్ ఫోన్లలో వాట్సాప్ లేనిదే ఆ ఫోన్ ఉండ‌దు. ఎప్పటికప్పుడు సరికొత్తగా ఫీచర్లతో యూజ‌ర్స్ ను ఆకట్టుకుంటున్న వాట్సాప్ అనేక‌మైన ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మధ్య కాలములో తీసుకొచ్చిన ఆ ఫీచర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్- డిసప్పీయరింగ్ మెస్సేజెస్ :
ప్ర‌తి ఒక్క‌రి స్మార్ట్ ఫోన్‌ల‌లో వాట్సాప్ ను వాడే చాలా మంది ఎప్ప‌టిక‌ప్పుడు తమ చాట్ ను డిలీట్ చేసుకోవ‌డం మరచిపోతారు. చాలా మంది మెసేజ్‌లు అలానే ఉండిపోయే అవకాశం ఉంది. దీనితో ఫోన్ కూడా చాలా స్లోగా అయిపోతుంది. వాట్సాప్ డిస‌ప్పియ‌రింగ్ మెసేజెస్ అనేటటువంటి కొత్త ఫీచరును తీసుకొచ్చింది. ఈ ఆప్ష‌న్ ఎన‌బుల్ చేసుకున్న వారికి పంపే మెసేజ్ లు వారం త‌ర్వాత కూడా వాటంత‌ట అవే డిలీట్ అయిపోతాయి.

whatsapp New Features Update

వాట్సాప్ పేమెంట్స్ :
వాట్సాప్ పేమెంట్‌.. ఇది అంద‌రికి ఉప‌యోగ‌ప‌డేటటువంటి ఫీచ‌ర్ అని చెప్పొచ్చు. ఈ ఫీచ‌ర్‌తో యూపీఐ ద్వారా వాట్సాప్ యూజ‌ర్లు మెసేజ్ పంపినంతగా సులభంగా డబ్బుల చెల్లింపులు జ‌రుపుకొనే అవకాశం ఉంటుంది. దీనికోసం వాట్సాప్ దాదాపుగా 160 బ్యాంకుల‌తో ప‌ని చేస్తుంది.

WhatsApp New Payment Updates
WhatsApp New Payment Updates

కస్టమరైజ్డ్ వాల్ పేపర్స్ :
క‌స్ట‌మైజ్డ్ ఫీచ‌ర్ల ద్వారా వాట్సాప్ లో ప్ర‌తి చాట్‌కు ఓ ప్ర‌త్యేక‌మైన వాల్ పేప‌ర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ అవ‌కాశం కూడా ఉంటుంది. ఈ ఫీచ‌ర్ ద్వారా ఫోటోలు మ‌నము వాలు పేప‌ర్ గా పెట్టుకునే అవకాశం ఉంది.

వాట్సాప్ పర్మనెంట్ మ్యూట్ ఆప్షన్ :
వాట్సాప్ పర్మెనెంట్ మ్యూట్ ఆప్ష‌న్ అనేది కొన్ని వాట్సాప్ గ్రూపుల‌తో పెద్ద‌గా ప‌నుండ‌దు. అయితే అలాంటి గ్రూపుల‌కు వ‌చ్చేటటువంటి మెసేజ్‌లు, దాని ద్వారా వ‌చ్చే శ‌బ్దము, వైబ్రేషన్ల కార‌ణంగానే కాస్త చికాకు తెప్పిస్తూ ఉంటుంది. ఆ ఇబ్బందులను తొల‌గించుకోవడానికి వాట్సాప్ ప‌ర్మినెంట్ మ్యూట్ ఆప్ష‌న్ ను తీసుకొచ్చింది. ఈ ఆప్ష‌న్ ద్వారా ఎంచుకుని ఏదైనా చాట్‌, గ్రూప్‌ను ప‌ర్మినెంట్‌గా మ్యూట్ చేసుకునే సదుపాయం అనేది ఉంది(whatsapp New Features).

These Are The New Whatsapp Featers
These Are The New Whatsapp Featers

వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్స్ :
యానిమేటెడ్ స్టిక్కర్స్ అనేది చాట్‌ను మ‌రింత కామెడీగా, ఆస‌క్తిక‌రంగా ఉండేందుకు వాట్సాప్ ఈ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా మ‌న యానిమేటెడ్ స్టిక్క‌ర్ల‌ను డౌన్ లోడ్ చేసుకుని మ‌న‌తో చాట్ చేసే వ్య‌క్తుల‌ను ఆనందపరిచేలా చేయొచ్చు.

వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్స్ :
చాలా మందికి వీడియో కాలింగ్ చేసుకునే అల‌వాటు పెరిగిపోయింది. గతంలో ఇత‌ర యాప్‌ల ద్వారా వీడియో కాలింగ్ చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపు వీడియో కాలింగ్ చేసుకునే ఫీచ‌ర్‌ను తెచ్చింది. ఇక‌ వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన వీడియో కాల్ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌ను  కవ్విస్తోంది. ఈ ఫీచ‌ర్ ద్వారా ఒకే సారి 8 మందితో వీడియో కాల్‌ చేసి మాట్లాడే స‌దుపాయం ఉంటుంది.

వాట్సాప్ అడ్వాన్సుడ్ సర్చ్ ఆప్షన్ :
వాట్సాప్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆప్ష‌న్‌ అనేది ఈ రోజుల్లో అంద‌రి వాట్సాప్ లో వంద‌లు, వేలాది మెసేజ్‌లు ఉంటాయని చెప్పొచ్చు. మ‌న‌కు వ‌చ్చిప ఏదైనా ముఖ్య‌మైన మెసేజ్‌ను వెతకడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. మ‌న‌కు కావాల్సిన ముఖ్య‌మైన మెసేజులను వెతుక్కోవడము చాలా కష్టమైన పనిగా చెప్పొచ్చు. అలాంటి వారి కోసమే వాట్సాప్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆప్ష‌న్ ను మన ముందుకు తెచ్చింది. ఈ ఆప్ష‌న్ తో కేవ‌లం టెక్స్ట్ మెసేజ్‌లు మాత్ర‌మే కాకుండా డాక్యుమెంట్లు, ఫోటో, వీడియో, జీఐఎఫ్ ఫైళ్ల‌ను సైతం సులువుగా వెతుక్కునే అవ‌కాశం కలుగుతుంది.

వాట్సాప్ క్యూఆర్ కోడ్స్ :
క్యూఆర్ కోడ్ ఫీచ‌ర్ వాట్సాప్ యూజ‌ర్ల‌కు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ఫీచ‌ర్ తో యూజ‌ర్లు అతి సులభంగా తమ కాంటాక్టుల‌ను యాడ్ చేసుకోవచ్చు. వారి కాంటాక్ట్ వివ‌రాల‌ను క‌స్ట‌మైస్డ్ క్యూఆర్ కోడ్ ద్వారా పంపించుకునే అవకాశం ఉంటుంది.

వాట్సాప్ డార్క్ మోడ్ :
ఇన్‌స్టాగ్రామ్, ట్విట్ట‌ర్ వాటికే ప‌రిమితంగా ఉండే ఈ డార్క్ కోడ్‌ను వాట్సాప్ తమ యూజ‌ర్ల‌కు తీసుకొచ్చింది. ఈ ఫీచ‌ర్‌ ద్వారా వాట్సాప్ కొత్త‌గా క‌నిపిస్తుంది. అంతే కాకుండా యూజ‌ర్ల క‌ళ్ల మీద ఒత్తిడి కూడా చాలా వరకూ త‌గ్గుతుంది. ఈ డార్క్ మోడ్ లేని కార‌ణంగా క‌ళ్ల‌మీద ప్ర‌భావం చూపే అవ‌కాశం ఇది వరకూ చాలా ఉండేది. అలాంటి ఇబ్బందులు ఉండకుండా వాట్సాప్ ఈ ఫీచ‌ర్‌ను మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

whatsapp New Features
whatsapp New Features

వాట్సాప్ న్యూ స్టోరేజ్ మేనేజ్ మెంట్ టూల్ :
సాధారణంగా వాట్సాప్ లో ప‌రిమితికి మించి టెక్స్ట్ మెసేజ్‌లు, వీడియో, ఫోటోలు స్టోర్ చేసుకునే అవ‌కాశం లేదు. మ‌నము వాటిని కొన్ని సార్లు డిలీట్ చేయడం మ‌ర్చిపోతుంటాం. దీంతో వాట్సాప్ న్యూ స్టోరేజ్ మెసేజ్‌మెంట్ టూల్‌ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచ‌ర్ ద్వారా ఐదు ఎంబీల క‌న్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి ఫైళ్ల‌ను మ‌న‌కు ముందు వ‌రుస‌లో తెలుపుతుంది. దీంతో మ‌నం అవ‌స‌ర‌మైన ఫైళ్ల‌ను డిలీట్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఈ స్టెప్స్‌తో వాట్సాప్ లోని సీక్రెట్ చాట్‌ను సేఫ్‌గా ఉంచండి.

మీ వాట్సాప్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో కుడివైపు టాప్‌లో ఉన్న 3 చుక్కలు క్లిక్ చేయాలి.
ఆ తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
తర్వాత అకౌంట్‌పై క్లిక్ చేసి ప్రైవసీ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి
అప్పుడు మీకు కనిపించే కొన్ని ఆప్షన్స్‌లో లాస్టుది ఫింగర్ ప్రింట్ లాక్.
ఫింగర్ ప్రింట్ లాక్ పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఆ పనిని పూర్తి చేయాలి.
ఇక వాట్సాప్‌ను క్లోజ్ చేస్తే వెంటనే ఫింగర్ ప్రింట్ లాక్ యాక్టివేట్ అయిపోతుంది.

వాట్సాప్‌లో ప్రస్తుతం చాలా కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. తాజాగా వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందించబోతోంది. అదేంటంటే చాట్ బ్యాకప్స్‌కి కూడా పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా అంటే మీ చాట్స్‌ని బ్యాకప్ చేసినప్పుడు పాస్‌వర్డ్ సెట్ చేయాలి. మళ్లీ మీరు ఆ చాట్స్ రీస్టోర్ చేయాలనుకుంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌‌ ప్రయోగదశలో ఉంది. కాగా, ఈ ఫీచర్ వాట్సాప్‌ ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది. ప్రస్తుతం వాట్సాప్‌లోని చాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదు. దాంతో ముఖ్యమైన చాట్స్ బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం వాట్సప్.. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ తీసుకొస్తోంది. పాస్‌వర్డ్ సెట్ చేస్తే ఆ చాట్స్‌ని రీస్టోర్ చేయాలంటే పాస్‌వర్డ్ తప్పనిసరి. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 

Previous articleసిమ్‌ కార్డు లేకుండానే ఫోన్‌ కాల్స్‌..రాంగ్ కాల్స్‌కు చెక్‌ పెట్టే సరికొత్త యాప్‌
Next articleనిరుద్యోగులకు గుడ్ న్యూస్..సదరన్‌ రైల్వేలో 3378 ఉద్యోగాలు