Home ఆరోగ్యం లాక్‌డౌన్ లో బరువు తగ్గితే ఇన్ని లాభాలా? బరువు పెరగకుండా చేయండిలా

లాక్‌డౌన్ లో బరువు తగ్గితే ఇన్ని లాభాలా? బరువు పెరగకుండా చేయండిలా

148
0
How Workouts To Lose Weight During Lock Down
How Workouts To Lose Weight During Lock Down

చాలా మంది లాక్ డౌన్ టైమ్ ఇళ్లకే పరిమితమవ్వడం వల్ల అధిక బరువు పెరుగుతున్నారు. మామూలుగా అయితే జిమ్ కు వెళ్లడం, వ్యాయామం చేయడం, ఇలా ఏవేవో ఆరోగ్య సూచనలు పాటిస్టూ ఉండేవారు. లాక్ డౌన్ లో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల వారిపై బరువు సమస్య పడింది. అలాంటి వారు ఇంట్లోనే ఉంటూ బరువు పెరగకుండా ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోనే ఉండేవారు ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే అధిక బరువు పెరగకుండా ఉండే అవకాశం ఉంది. ఇంట్లోనే మెట్లు ఎక్కి దిగడం, డాబాపై రౌండుగా నడవడం, ఇంట్లో వస్తువుల్ని అటూ ఇటూ కదపడం, పాత వస్తువులు ఉంటే వాటిని తీసి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, బట్టలు వాషింగ్ మెషిన్‌లో కాకుండా చేతులతో ఉతుక్కోవడం, వంట చెయ్యడం ఇలాంటి ఏవేవో పనులు చేయాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల ముందు కూర్చొని సినిమాల వంటివి చూడటం కంటే ఇంట్లో ఎప్పటి నుంచో పూర్తి చెయ్యాలనుకుంటున్న పనులను ఈ టైంలో చేసుకోవడం ఎంతో ఉత్తమమని వారు తెలియజేస్తున్నారు. ఇల్లును శుభ్రం చేసుకోవడం లేదా సున్నం, పెయింట్ వంటివి వేసుకోవడం వల్ల కొన్ని కేలరీలు తగ్గించుకునే అవకాశం ఉందంటున్నారు. 

తినే ఆహారం విషయంలోనూ తక్కువ కేలరీలు ఉండేవే తినాలని సూచిస్తున్నారు. వీలైనతవరకూ స్నాక్స్ తగ్గించేయాలని, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని వారు తెలుపుతున్నారు. ఫ్రైలు చేసుకోవడం చాలా మటుకు తగ్గించుకోవడం మంచిదని చెబుతున్నారు. వంటల్లో నూనె ఎక్కువగా వాడకుండా చూసుకోవాలని చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా తాగాలని, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, స్వీట్లు, చాకొలెట్లు వీలైనంతవరూ తినకుండా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజు ఉదయం 7 గంటలకే బ్రేక్ ఫాస్ట్ చేయడం మంచిదని, రాత్రి 7 గంటలకే భోజనం తినేస్తే అనేక అనారోగ్య సమస్యలు రావని వారు తెలుపుతునారు. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు తెలుపుతున్నారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు వచ్చినా ఎదుర్కోగలమని, అందుకే శరీరంలో కేలరీలు బర్న్ అయ్యేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఏపీలో భారీగా వాలంటీర్ ఉద్యోగాలు..దరఖాస్తుకు రేపే ఆఖరు తేది
Next articleప్రపంచ పర్యావరణ దినోత్సవం నేడే..మీరు నమ్మలేని నిజాలు