Home క్రీడలు Virat Kohli Predection: టీమిండియా భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్..

Virat Kohli Predection: టీమిండియా భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్..

305
0
Virat Kohli's prediction On India cricket Team
Virat Kohli's prediction On India cricket Team

ఇండియా క్రికెట్ టీమ్ ఇప్పుడు దూకుడుగా ముందుకు సాగుతోంది. కరోనా విపత్కర పరిస్థితులలో కూడా ఐపిఎల్ క్రికెట్ మ్యాచులు ఆడి అభిమానులకు చేరువయ్యింది. అయితే కరోనా కారణంగానే ఆ సీరిస్ వాయిదా పడింది. ఇక తగ్గేదేలే అంటూ ఈ సారి రెండు టీములుగా అటు ఇంగ్లండ్ పై ఇటు శ్రీలంకపై రసవత్తరపోరుకు సిద్దమవుతోంది. ఇదివరకూ ఓసారి ఇలాగే రెండు టీములతో సిరీస్ లను ఆడించారు. అయితే అనుకున్నట్లుగా ఫలితం రాలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆ టైంలో దారుణంగా విఫలం అవ్వడంతో మళ్లీ ఆ దిశగా ఏర్పాట్లేవీ చేయలేదు. అయితే మళ్లీ అటువంటి రీతిలోనే మ్యాచులు ఆడిస్తారనే విషయాన్ని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. 

Virat Kohli PredectionnOn Team India

కోహ్లీ కెప్టెన్సీలో ఓ జట్టు యూకేకు వెల్లింది. క్వారంటైన్ లో ఆ టీమ్ రెండు వారాలపాటు ఉండనుంది. ఆ తర్వాత ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఈనెల 18 నుంచి మ్యాచులు జరగనున్నాయి. ఈ టెస్టు క్రికెట్ మ్యాచుకు కోచ్ గా రవిశాస్త్రి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ..క్వారంటైన్ లో ఉండటం వల్ల ఆటగాళ్ల మనోబలం దెబ్బతినే అవకాశం ఉందని, క్రికెటర్లు ఇందుకు అలవాటు పడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 

ఇకపోతే మరో ఇండియా టీమ్ శ్రీలంకలో ఆడనుంది. విరాట్ కోహ్లీ స్పందిస్తూ..రాబోయే రోజుల్లో బీసీసీఐ ఇలాగే రెండు టీమ్ లతో ఆటలు ఆడించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే ఇలా సిరీస్ లు ఆడిస్తున్నప్పుడు కొన్ని రోజులపాటు క్వారంటైన్ ఉండక తప్పదని, అప్పుడే ఆడగాళ్ల మనసు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్ పై ఆటగాళ్లు ఫోకస్ చేయాలంటే ఈ క్వారంటైన్ అనేది అడ్డంకిగా ఉందని తెలిపారు. ప్రాక్టీస్ కూడా మందకోడిగా సాగుతుందని, ఆ టైంలోనే ఆటగాళ్లు ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని తెలిపాడు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..జగనన్న కాలనీ పధకం ప్రారంభం
Next articleఇక ప్రభుత్వాల్ని విమర్శిస్తే రాజద్రోహం కాదు..సుప్రీం సంచలన తీర్పు..రఘురామకు ఊరట