Home సినిమాలు హ్యాట్రిక్ కొట్టిన విజయ్ దేవరకొండ..మూడోసారి నంబర్ వన్‌ స్థానం..తర్వాతి స్థానాల్లో రామ్, ఎన్టీఆర్

హ్యాట్రిక్ కొట్టిన విజయ్ దేవరకొండ..మూడోసారి నంబర్ వన్‌ స్థానం..తర్వాతి స్థానాల్లో రామ్, ఎన్టీఆర్

226
1
Vijay Devarakonda Top Most Desirable Man In Tollywood 2020
Vijay Devarakonda Top Most Desirable Man In Tollywood 2020

టాలీవుడ్ మోస్ట్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ కొట్టాడు. మూడోసారి ఆయన నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత హీరోలు రామ్, ఎన్టిఆర్ ఉండటం విశేషం. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ మార్క్ దూసుకుపోయింది. స్టైల్ పరంగా విజయ్ కొత్త కొత్త లుక్స్ తో అమ్మాయిల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచారు. విజయ్ ఇది వరకూ 2016 , 2017, 2018, 2019, 2020 ఏడాదుల్లో ప్రథమ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. విజయ్ తర్వాత రెండవ ప్లేస్ లో రామ్, మూడవ ప్లేస్ లో ఎన్టీఆర్, నాల్గవ ప్లేస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐదవ ప్లేస్ లో నాగశౌర్యలు నిలవడం జరిగింది

ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఇన్ స్టాలో విజయ్ కు పన్నెండు మిలియన్స్ అభిమానులు ఉన్నారంటే ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏపాటితో మీరే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పూరీ డైరెక్షన్ లో విజయ్ నటిస్తున్నారు. లైగర్ సినిమా పాన్ ఇండియా లెవల్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండే నటిస్తూ గ్లామస్ డోస్ ఇస్తోంది. పూరీ గత చిత్రం అయిన ఇస్మార్ట్ శంకర్ సక్సస్ ఫుల్ విజయాన్ని అందుకుంది. దీంతో పూరీ ఇప్పుడు తీస్తున్న లైగర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 

లైగర్ సినిమాను ఛార్మీ, కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించడం వల్ల దీనిపై భారీ అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో ఫైటర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమానుయ 125 కోట్లతో రూపొందిస్తున్నారు. ముప్పావు శాతం ఈ చిత్రం షూటింగును జరుపుకుంది. అయితే కరోనా కారణంగా సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. రమ్యకృష్ణ కూడా ఈ చిత్రంలో ఓ కీలక కేరక్టర్ లో కనిపించనుంది.

Read Also: ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ తెలంగాణా న్యూస్ అంతర్జాతీయ వార్తలు జాతీయ వార్తలు కోవిడ్ 19 న్యూస్

Previous articleఆనందయ్య మందుపై దుమారం..టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
Next articleమనుషులు 150 ఏళ్లు బతుకుతారా?..నిజమేనని రుజువు చేస్తున్న పరిశోధనలు

1 COMMENT

Comments are closed.