Home Covid 19 వ్యాక్సిన్ వేసుకుంటే బీరు ఫ్రీ..ఎక్కడంటే?

వ్యాక్సిన్ వేసుకుంటే బీరు ఫ్రీ..ఎక్కడంటే?

209
0
US Govt Offers Beer Free For Vaccination
US Govt Offers Beer Free For Vaccination

దేశంలో కరోనాను అంతం చేయడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ వల్ల తీవ్ర అనారోగ్యపాలై కొందరు మరణించిన ఘటనలు చోటుచేసుకోవడం వల్ల వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. అందుకోసం ప్రభుత్వాలు కొన్ని షరతులు కూడా పెట్టడంతో ఇక తప్పదు కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వ్యాక్సిన్ వేసుకునేవారికి అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి ఇక్కడ కాదు. అమెరికాలో వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అక్కడి ప్రభుత్వం బీరు ఫ్రీగా ఇస్తోంది. దీంతో యువత ఎక్కువగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. 

US Govt Beer Free For Vaccination

వ్యాక్సిన్ వేసుకుంటే బీర్, పెట్రోల్, సేవింగ్ బాండ్లు, ఎయిర్ లైన్ టికెట్స్, సరుకులు కొనుక్కునేందుకు 500 డాలర్లు అంటే రూ.36,982 ఇస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసేందుకు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కంపెనీలు కూడా జనం టీకా వేసుకునేలా ఆఫర్లు ప్రకటించడం విశేషం. టీకా వేసుకున్నోళ్లకు కొన్ని బ్రూవరీల్లో ఫ్రీగా బీర్ ఇస్తున్నారు.  డెట్రాయిట్ నగరంలో ఎవరినైనా వ్యాక్సిన్ సెంటర్ దగ్గరికి తీసుకొస్తే 50 డాలర్లు ఇస్తున్నారు. 21 ఏళ్లు పైబడిన యువతను దృష్టిలో ఉంచుకొని కొత్త ఆఫర్ ను అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఇక ప్రభుత్వాల్ని విమర్శిస్తే రాజద్రోహం కాదు..సుప్రీం సంచలన తీర్పు..రఘురామకు ఊరట
Next articleనితిన్ మరో కొత్త చిత్రం షురూ..ఆగస్టులో సెట్స్ పైకి మూవీ