Home జాతీయ వార్తలు ఫేక్ న్యూస్ పని ఖతం..‘బర్డ్ వాచ్’ పేరుతో ట్విట్ట‌ర్‌ కొత్త టూల్‌

ఫేక్ న్యూస్ పని ఖతం..‘బర్డ్ వాచ్’ పేరుతో ట్విట్ట‌ర్‌ కొత్త టూల్‌

155
0
Twitter Intorduce New Tool Bird Watch
Twitter Intorduce New Tool Bird WatchTwitter Intorduce New Tool Bird Watch

ప్రస్తుతం సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. ఎక్కడ, ఏ క్షణంలో అయినా ఏం జరిగినా ఆ వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమైపోతోంది. కుర్రకారు కూడా ఎక్కువగా సోషల్ మీడియాకు అలవాటుపడిపోతున్నారు. కొందరు తమలోని టాలెంట్ ను నిరూపించుకుంటుంటే మరికొందరు వ్యసనంలా సోషల్ మీడియాలో గడుపుతున్నారు. చాలా వరకూ సోషల్ మీడియా సమాచారాన్ని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అయితే ఇక్కడే మరో విషయం ఉంది. చాలా మంది ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీనివల్ల అనేక మంది మోసపోతున్నారు. 

సోషల్ మీడియాలో ఇటువంటి నకిలీ వార్తలను, సమాచారాన్ని పూర్తిగా లేకుండా చేయడానికి సోషల్ మీడియా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా వారు ఓ కొత్త టూల్ ను అభివృద్ధి చేసి మనముందుకు తెచ్చారు.  ప్రస్తుతం ఈ కొత్త టూల్ ను డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ యూజర్లలో కొంతమందికి పైలట్ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి తెచ్చారు. దీనిద్వారా వినియోగదారులు త‌మ‌కు అనుమానం వచ్చిన ట్వీట్ల‌ను మార్క్ చేసి అందుకు గ‌ల కార‌ణాల‌ను తెలియజేయాలి. ఆ తర్వాత ఆ ట్వీట్ ఎందుకు తప్పు అనే విష‌యాన్ని తెలుసుకోనేందుకు ఒక సర్వే చేస్తారు. ట్వీట్ ఫేక్ అని తెలిస్తే తొల‌గిస్తుందా లేదా ఏదైనా మార్క్ చేస్తుందా అన్న విషయంలో ట్విట్టర్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఆ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువ యాంటీబాడీస్..వెలుగులోకి సంచలన నిజాలు
Next articleబిగ్ బాస్ సీజన్ 5లో ఉండేది వీరే..త్వరలో ప్రారంభంకానున్న షో