Home ఆంధ్ర ప్రదేశ్ ఆనందయ్య మందుపై దుమారం..టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆనందయ్య మందుపై దుమారం..టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

197
2
TTD Chirman YV Subba Reddy About Anandayya Medicine
TTD Chirman YV Subba Reddy About Anandayya Medicine

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆయుష్ ఇచ్చిన రిపోర్టులో ఆనందయ్య మందు ఆయుర్వేదం మందు కాదు అని చెప్పిందని వైవీ వ్యాఖ్యానించారు. ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుతో కోవిడ్ తగ్గుతుందని ఎక్కడా చెప్పలేదని అయితే వాడొద్దు అని కూడా చెప్పలేదని తెలిపారు. ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆ మందు తీసుకోవాలా, వద్దా అనే నిర్ణయాన్ని ప్రజల ఇష్టానికి వదిలేశారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

TTD Chirman YV Subba Reddy Comments On Anandayya Medicine
TTD Chirman YV Subba Reddy Comments On Anandayya Medicine

ఆయుర్వేదం కాదు కనుక ఆనందయ్య మందును పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని టీటీడీ ఆయుర్వేద కాలేజ్ విరమించుకుందని ఆయన తెలిపారు. ఆనందయ్య మందును టీటీడీ ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని మొదట్లో భావించామని, అయితే ప్రస్తుతానికి పంపిణీ ఆలోచన లేదని వైవీ స్పష్టం చేశారు. 

భవిష్యత్తులో రిపోర్టులు మెరుగ్గా వస్తే పరిశీలిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. మరో వైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ఆనందయ్య మందుపై స్పందించారు. ఆనందయ్య మందుకు ప్రభుత్వం సంప్రదాయ మందుగా వినియోగించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెవిరెడ్డి చెప్పారు.

ఇమ్యూనిటి బూస్టర్‌గా పనిచేస్తున్న ఆనందయ్య మందును ఇంట్లో కూడా తయారు చేసుకొని వాడవచ్చని సూచించారు. ఆనందయ్య మందుని ఇంటింటికి పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Read Also: ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ తెలంగాణా న్యూస్ అంతర్జాతీయ వార్తలు జాతీయ వార్తలు కోవిడ్ 19 న్యూస్

Previous articleకరోనా వ్యాక్సిన్ మనిషిని ఎంతకాలం కాపాడగలుగుతుంది? సంచలన విషయాలివే
Next articleహ్యాట్రిక్ కొట్టిన విజయ్ దేవరకొండ..మూడోసారి నంబర్ వన్‌ స్థానం..తర్వాతి స్థానాల్లో రామ్, ఎన్టీఆర్