Home సినిమాలు TNR కుటుంబానికి దర్శకుడు మారుతి 50 వేల సాయం

TNR కుటుంబానికి దర్శకుడు మారుతి 50 వేల సాయం

191
0

కరోనా బారిన పడి ఈ మధ్య కాలంలో ఇంటర్య్వూ స్పెషలిస్ట్, జర్నలిస్ట్ TNR మరణించారు. ఆయన మరణంతో తెలుగు ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబాన్నికి ఆర్థికంగా సాయం చేయడానికి సినిమా వాళ్ళు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముందుకొస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తక్షణ సాయంగా లక్ష రూపాయలను టి ఎన్ ఆర్ భార్య జ్యోతి గారికి పంపారు. అలాగే హీరో సంపూర్ణేష్ బాబు కూడా 50 వేల రూపాయలు ఆర్థికసాయం చేశారు. ప్రముఖ దర్శకుడు మారుతి కూడా తన వంతుగా 50 వేల రూపాయలను TNR భార్య జ్యోతి పేరున బ్యాంక్ ఖాతాకు పంపించి, ప్రతి ఒక్కరు తమకు తోచినంత సాయం చేయాలని కోరి, తన ఉదారత చాటుకున్నారు.        

రెండు భాగాలుగా సుకుమార్ పుష్ప సినిమా

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ డైరక్షన్ లో

మైత్రీ మూవీస్ సంస్థ భారీగా నిర్మిస్తున్న ” పుష్ప ” సినిమా రెండు భాగాలుగా రాబోతుందని మైత్రీ మూవీస్ సంస్థ ఖరారు చేసింది. సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అసలు రెండు భాగాల గురించి ఆలోచనే లేదని చెప్పాడు. కానీ కథ ప్రకారంగా తీస్తున్న లెంత్ ని బట్టి చూస్తుంటే…చివరికి 4 గంటల వరకు పుటేజీ వస్తుందన్ననిర్ణయానికి వచ్చాడు సుకుమార్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రెండు భాగాలు వచ్చిన సినిమాలు రెండే రెండు. అందులో ఒకటి ప్రభాస్ బాహుబలి. బాలకృష్ణ చేసిన ఎన్టీఆర్ జీవిత కథ. అయితే ఈ రెండింటిలో బాహుబలి సూపర్ డూపర్ హిట్ అయింది. బాలయ్య బాబు తీసిన ఎన్టీఆర్ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇప్పుడు రెండు భాగాలు వచ్చే ” పుష్ప ” సినిమా అటు బాహుబలి అవుతుందా లేక ఇటూ ఎన్టీఆర్ కథ అవుతుందా? హిట్టా…పట్టా ! అన్నది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. 4 గంటలు వచ్చిన పుష్ప సినిమాను రెండు గంటలకు కుదించడం కంటే, రెండు భాగాలుగా చేసి విడుదల చేస్తే…కమర్షియల్ గా రెండింతల రాబడి ఉంటుందని మైత్రీ మూవీస్ సంస్థ రెండు భాగాల ఫార్ములాను తెరపైకీ తీసుకోచ్చినట్టుంది. పుష్ప సినిమా కమర్షియల్ విధానంలో మైత్రీ మూవీస్ సంస్థ ఏవో కొత్త దారులను అవ‌లంభిచ‌నుంద‌ని సినీ వర్గాలల టాక్‌.

Previous articleవంటికి మట్టి మేలు, బురదతో ఆకట్టుకున్న పూనమ్ కౌర్
Next articleమహేష్ బాబు ” సర్కార్ వారి పాట” పై భారీ అంచనాలు