Home జాతీయ వార్తలు దేశంలోని ఆ రాష్ట్రాల్లో అన్ లాక్..భారీ సడలింపులు

దేశంలోని ఆ రాష్ట్రాల్లో అన్ లాక్..భారీ సడలింపులు

135
0
These States Extended Lock Down With Some Relaxations
These States Extended Lock Down With Some Relaxations

భారత దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు తమ పరిధిలో లాక్ డౌన్ రూల్స్ ను సడలిస్తూ వస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ, తమిళనాడు, మేఘాలయ రాష్ట్రాలు తమ పరిధిలో ఆంక్షలను కుదిస్తూ ఈ నెల 14 వ తేది వరకూ లాక్ డౌన్ ను పొడిగించాయి. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కొన్ని కఠిన నియమాలతో ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. ఇకపోతే మహారాష్ట్ర సర్కార్ తమ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టింది. ఐదు రకాల వ్యూహంతో లాక్ డౌన్ ఆంక్షలను మహారాష్ట్ర ప్రభుత్వం సడలించింది. 

ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుతుండటం వల్ల అన్ లాక్ పెట్టారు. సరి బేసి విధానంలో సడలింపులు ఢిల్లీలో ఉండనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాల్సు, షాపింగ్ దుకాణాలు, చిల్లర కొట్లు..ఇలా ఒక రోజు కొన్ని మరో రోజు ఇంకొన్ని తెరుచుకునేలా ఢిల్లీ ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియను అమలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ఇచ్చింది. షాపులు కూడా ఉదయం 10 నుంచి 8 గంటల వరకూ మాత్రమే తెరవాల్సి ఉంటుంది. అయితే మెడికల్ షాపులు, నిత్యావసర షాపులు రోజూ తెరుచుకునేందుకు ఆదేశాలిచ్చింది. 

మేఘాలయ రాష్ట్రం కూడా జూన్‌ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. కరోనా జాగ్రత్తలతో అన్నీ షాపులూ తెరవవచ్చు. అయితే టీ దుకాణాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ టీ షాపులను తెరుచుకోకూడదని పేర్కొంది. మార్కెట్లు, షాపులు మధ్యాహ్నం 3 గంటలలోపు మూసివేయాలని ఆదేశాలిచ్చింది. 

తమిళనాడు రాష్ట్రంలో మాత్రం కరోనా కేసులు తగ్గలేదు. దీంతో లాక్ డౌన్ ను జూన్ 14వ తేది దాకా పొడిగించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన 27 జిల్లాల్లో కొన్ని ఆంక్షలను తగ్గించింది. తమిళనాడులో మే 8వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleనటి జుహీ చావ్లాపై హైకోర్టు ఫైర్..రూ.20 లక్షల జరిమానా
Next articleతెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం