Home తెలంగాణ లాక్ డౌన్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు..రోడ్డుపై కనిపిస్తే ఐసోలేషన్ కు తరలింపు

లాక్ డౌన్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు..రోడ్డుపై కనిపిస్తే ఐసోలేషన్ కు తరలింపు

134
0
Telangana Police Decision On Who Break Down Lock Down Rules
Telangana Police Decision On Who Break Down Lock Down Rules

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుదల పడుతున్నాయి. చాలా మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో కొందరు పాత పద్దతులనే పాటిస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీంతో ఫ్రంట్ వారియర్స్ అయిన పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అటువంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. కరోనా కేసుల తగ్గుదలకు పోలీసులు ఎవ్వరినీ బయటకు రానివ్వడం లేదు. వారికి కేటాయించిన సమయాల్లోనే ప్రజలకు బయటకు తిరగాలి. అయితే ఇలా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తూ బయట తిరుగుతున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 

బయట ఎవరైనా తిరిగితే చాలు వారిని అరెస్టు చేస్తూ ఐసోలేషన్  కు తరలిస్తున్నారు. రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు పర్యవేక్షిస్తున్న సమయంలో చాలామంది బయట తిరగడం వంటి చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పలేదు. నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని, ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులను పట్టణ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అంతేకాకుండా కొన్ని కాలనీల్లో ఉన్న షాపుల యజమానులను కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు చేసినవారిని ఐసోలేషన్ కు తరలించారు. ఎవరైనా మళ్లీ బయట తిరుగుతూ కనిపిస్తే వారిని కూడా ఐసోలేషన్ కు తీసుకెళ్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleజిమ్ లో రచ్చ చేస్తోన్న వర్మ, ఆరియానా..కొత్త సినిమాకు ప్లాన్ చేస్తున్నారా?
Next articleవాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడండిలా