Home తెలంగాణ తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

204
0
Telanagana Cabinet Meeting
Telanagana Cabinet Meeting

ప్రగతి భవన్ వేదికగా తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ ఫైలుకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. సాగునీరు, ప్రస్తుత కాలంలో సేద్యం, దానికి ప్రభుత్వ సహకారం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

ఇక కరోనా కేసుల నమోదు తగ్గుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగించాలా, వద్దా? లేక నైట్ కర్ఫ్యూను పెట్టాలా అనే అంశాలపైనా మంత్రి మండలి చర్చించనుంది. లాక్ డౌన్ కారణం ప్రజల ఆర్థిక పరిస్థితులకు ఊతమిచ్చే అంశాలను పరిశీలించడం, దానికి అనుగుణంగా అవసరమైన చేయూతనివ్వడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఇక ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి కూడా లాక్ డౌన్ తో భారీగా గండి పడటంతో, ఆ ప్రభావం సంక్షేమ కార్యక్రమాలపై పడకుండా అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించే అవకాశాలున్నాయి.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleబాలీవుడ్ వైపు పూరి చూపు
Next articleEtela Rajendar Counter To Palla పల్లా కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఇటల రాజేందర్