Home సినిమాలు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో సిద్దార్థ్ పితానిని అరెస్ట్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో సిద్దార్థ్ పితానిని అరెస్ట్

150
1

ప్రస్తుతం అనేక మలుపు తిరుగుతున్న బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో సిద్దార్థ్ పితానిని అరెస్ట్ చేయడం మరింత సంచలన రేపింది. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. సుశాంత్‌ ఇంటిలో ఉన్న వారిని నిశితంగా ప్రశ్నించారు. జూన్ 14వ తేదీ రాత్రి, ఆ ముందు రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను అధికారులు సేకరించారు. ఈ క్రమంలోనే సుశాంత్‌తో ఇంటిలో దాదాపు ఏడాది కాలంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ్ పితానిపై పోలీసులు దృష్టిపెట్టారు. సుశాంత్ మరణం కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి స్నేహితుడు సిద్దార్థ్ పితానిని ముంబైకి చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్‌లోని రాచకొండ విభాగం పోలీసులు ధృవీకరించారు.

Siddarth pithani rajputh

సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. సుశాంత్ ఇంటిలో ఉన్న ఫ్రెండ్స్ అతడికి డ్రగ్స్ సరఫరా చేశారనే విషయంపై పలువురిని విచారించారు. ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మాజీ మేనేజర్ దిశా సలియాన్ అనుమానాస్పద మరణాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం సిద్ధార్థ్ పితానికి తెలిసి ఉంటుందనే కోణంలో విచారణకు సిద్ధమయ్యారు. ముంబైలో పరిస్థితులు దారుణంగా మారడంతో సిద్ధార్థ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. దర్యాప్తును మరోసారి వేగవంతం చేసిన నార్కోటిక్ కంట్రోల్ అధికారులు శుక్రవారం మే 28వ తేదీ ఉదయం సిద్దార్థ్‌ను అరెస్ట్ చేశారు. సిద్దార్త్ పితాని అరెస్ట్‌కు ముందు మే 7వ తేదీన సుశాంత్ రాజ్‌పుత్ మరణంతో కనెక్షన్ ఉన్న హేమంత్ షా అలియాస్ మహారాజ్‌ను అరెస్ట్ చేశారు. ముంబైలో కొందరికి డ్రగ్స్ సప్లయి చేశారనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పితాని అరెస్ట్ జరిగిందనే విషయం బయటకు వచ్చింది.

Siddarth pithani with his friends

సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలకంగా మారిన సిద్ధార్థ్‌ను వ్యక్తిగతంగా కలుసుకోవడంలో విఫలమైన బీహార్ పోలీసులు గతంలో ఫోన్ ద్వారా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఫోన్‌లో పలు ప్రశ్నలను సంధించిన అవసరమైన సమాచారాన్ని రికార్టు చేసినట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేయడం బాలీవుడ్‌లో మరింత చర్చనీయాంశమైంది.

Also Read More Articles : లెజెండరీ గాయని పి.సుశీల బయోపిక్, నిర్మాతగా ఏ.ఆర్ రెహమాన్ !
నిజంగానే షాక్ ఇచ్చాడు…వామ్మో, శవాలపై కళ్యాణ్ రామ్ భయంకరమైన లుక్

Previous articleనిజంగానే షాక్ ఇచ్చాడు…వామ్మో, శవాలపై కళ్యాణ్ రామ్ భయంకరమైన లుక్
Next articleఐదేళ్లు సహజీవనం.. గర్బవతిని చేసి ముఖం చాటేశాడు.. మాజీ మంత్రిపై హీరోయిన్ చాందిని సంచలన ఆరోపణలు

1 COMMENT

Comments are closed.