Home ఆంధ్ర ప్రదేశ్ ఇక ప్రభుత్వాల్ని విమర్శిస్తే రాజద్రోహం కాదు..సుప్రీం సంచలన తీర్పు..రఘురామకు ఊరట

ఇక ప్రభుత్వాల్ని విమర్శిస్తే రాజద్రోహం కాదు..సుప్రీం సంచలన తీర్పు..రఘురామకు ఊరట

275
0
Supreme Court Judgement In MP Raghurama Krishna Raju Case
Supreme Court Judgement In MP Raghurama Krishna Raju Case

కొన్ని సంవత్సరాలుగా కేంద్ర సర్కార్, రాష్ట్ర సర్కార్ లిఖించుకున్న రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టు నేడు ఇంకోసారి స్పష్టత నిచ్చింది. ప్రముఖ జర్నలిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వినోద్ దువాపై రాజద్రోహం కేసు నమోదైనట్లు తెలిసిందే. అయితే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఎట్టకేలకు దాన్ని కొట్టి పారేసింది. సర్కారుకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తే అది రాజద్రోహం కాదని సుప్రీం మరో సారి మోహమాటపడకుండా చెప్పేసింది. దీంతో ఈ విషయం కొందరికి శుభవార్త అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో రాజద్రోహం కేసు ఉన్న 2 టెలివిజన్ ఛానళ్లతో పాటు వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామరాజుకూ ఇది తీపి కబురు లాంటిది.

కేంద్ర సర్కార్ తమకు వ్యతిరేకంగా విమర్శ చేస్తున్నవారిపై రాజద్రోహం కేసు పెట్టడం ఈ మధ్య సాధారణమైపోయింది. ఏడు సంవత్సరాలలో దేశం మొత్తం మీద  ఏడు వేల రాజద్రోహం కేసులు నమోదు అయ్యాయి. అందులో కూడా ఎక్కువగా బిజెపి పాలిస్తున్న ప్రాంతాలలో నమోదు కావడం జరిగింది.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా తనపై విమర్శలు గుప్పిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుపై రాజద్రోహం కేసు పెట్టింది. ఆ తర్వాత ఆయన మాటలను ప్రజలకు వినిపించిన రెండు టీవీ ఛానళ్లను కూడా వదల్లేదు. వాటిపై కేసులు వేసింది. 

Supreme Court Decision On MP Raghurama Krishna Raju Case

ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఓ యూట్యూబ్ ఛానల్లో విమర్శలు చేసిన నేరానికి ప్రఖ్యాత జర్నలిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వినోద్ దువాపై రాజద్రోహం కేసు నమోదైంది. అయితే ఆ కేసును కూడా సుప్రీం కొట్టేసింది. ఈ తీర్పు ప్రకారం ప్రతీ జర్నలిస్టూ రాజద్రోహం అభియోగాలకు వ్యతిరేకంగా రక్షణ పొందవచ్చని సుప్రీం తెలిపింది.1962లో దాఖలైన రాజద్రోహం ఆరోపణలకు సంబంధించి కేంద్రం వర్సెస్‌ కేదార్‌నాథ్‌ సింగ్‌ కేసులో సుప్రింకోర్టు ఓ కీలకమైన తీర్పు చెప్పింది. చట్టబద్ధంగా ఎవ్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు హింసాత్మక పద్ధతుల్లో జరిగే కుట్రను మాత్రమే రాజద్రోహంగా పరిగణించవచ్చని ఈ తీర్పు పేర్కొంది. ఇప్పుడు అదే తీర్పును సుప్రీంకోర్టు మరోసారి ముందుకు తెచ్చింది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleVirat Kohli Predection: టీమిండియా భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్..
Next articleవ్యాక్సిన్ వేసుకుంటే బీరు ఫ్రీ..ఎక్కడంటే?