Home సినిమాలు ఆర్ఆర్ఆర్ కు ముందే రాజమౌళి షార్ట్ ఫిలిం..వారికి హ్యాట్సాఫ్ చెప్పనున్న టీమ్

ఆర్ఆర్ఆర్ కు ముందే రాజమౌళి షార్ట్ ఫిలిం..వారికి హ్యాట్సాఫ్ చెప్పనున్న టీమ్

208
0
SS Rajamouli Short Film On Police Department
SS Rajamouli Short Film On Police Department

తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్స్ డైరెక్టర్ గా రాజమౌళి పేరుంది. ఏ ప్రాజెక్టు పట్టుకున్న ఆయన హిట్టు కొట్టడం ఖాయం. అయితే ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తూ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లను బలమైన నాయకులుగా తీర్చిదిద్దే పనులలో ఉన్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి సినిమా చేస్తున్నారంటే ఆ సినిమాపై విపరీతమైన భారీ అంచనాలనే ఉండటం సహజం. తాజాగా రాజమౌళి ఓ చిన్న మూవీ తీయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఆర్ఆర్ఆర్ కంటే ముందుగా ఈ షార్ట్ ఫిల్మ్ ను తీసి విడుద చేయనున్నారు. 

కరోనా టైంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసుల గొప్పతనాన్ని తెలుపుతూ ఈ షార్ట్ ఫిల్మ్ ఉండనుంది. రాజమౌళి ఓ గొప్ప కాన్సెప్ట్ తో పోలీసు ఉన్నతాధికారులకు షార్ట్ ఫిల్మ్ విషయాన్ని చెప్పగానే వాళ్లు ఆ మూవీ చేయడానికి ఓకే చెప్పారు. దీంతో 19 నిమిషాలపాటు ఉండే ఈ షార్ట్ ఫిల్మ్ ను చేయడానికి రాజమౌళి టీమ్ సిద్దమైంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleనిరుద్యోగులకు శుభవార్త..వైద్య శాఖలో మరో 7వేల పోస్టులు
Next articleకారా మాస్టారు కన్నుమూత..అస్తమించిన అక్షర సూరీడు