Home తెలంగాణ కరీంనగర్ లో పాము నుంచి వింత అరుపులు..భయం భయంగా స్థానికులు

కరీంనగర్ లో పాము నుంచి వింత అరుపులు..భయం భయంగా స్థానికులు

254
0
snake crowd sounds In Karimnagar
snake crowd sounds In Karimnagar

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. పాము నోరు తెరిస్తే వింత అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  పాము అరుస్తున్న సమయంలో సెల్ ఫోన్లతో వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అయితే ఈ పాముపై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈస్టర్న్ హోగ్ నోస్ స్నేక్ గా పిలిచే ఈ పాము నార్త్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తిరుగుతుందని, భారత్ లో కనిపించదని కొందరు నెటిజన్లు అంటున్నారు.అయితే ఈ వీడియో నెలక్రితం యూట్యూబ్ లో ఓ విదేశీయుడు పోస్టు  చేసినట్లు మరికొందరు చెబుతున్నారు. కరీంనగర్ లో వింత పాముఅనేది ఫేక్ అని మరికొందరు తెలుపుతున్నారు. ఏదిఏమైనా వీడియో మాత్రం సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=drorO_Hdjbk

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleపవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..త్వరలో ఆ సినిమా ఫస్ట్ లుక్
Next articleటీడీపీకి షాక్..తెలంగాణలో ఆ ముఖ్యనేత గుడ్ బై..