Home సినిమాలు సీనియర్ జర్నలిస్టు, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో మృతి

సీనియర్ జర్నలిస్టు, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో మృతి

196
2
BA raju film producer died

కొద్ది రోజలు క్రితం కరోనా వైరస్ బారిన పడిన టాలీవుడ్‌ సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆయన బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో చేర్చమని, చికిత్స పొందుతూ ఆకస్మికంగా మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆయన కుమారుడు శుక్రవారం రాత్రి షుగర్ లెవెల్స్‌లో హెచ్చు తగ్గులు రావడంతోపాటు గుండెపోటు రావడంతో తన తండ్రి మరణించారని తెలిపారు.

శుక్రవారం సాయంత్రం షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గులు కావడం, గుండెపోటు గురి కావడంతో తుదిశ్వాస విడిచారని, నా తండ్రి బీఏ రాజు ఆకస్మికంగా మరణించారని తెలియజేయడానికి చాలా బాధగా, విషాదంగా ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. పేరుకు తగ్గట్టుగా బతికినంత కాలం వారు రాజుగానే ఉన్నారు. మా గుండెల్లో సూపర్‌హిట్‌గానే ఉంటారు అని ట్వీట్‌లో తెలిపారు. ఆయన భార్య, సినీ దర్శకురాలు బీ జయ ఆగస్టు 30, 2018 తేదీన మరణించారు. వరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శివకుమార్ దర్శకత్వం బాధ్యతలు ఇటీవలే చేపట్టారు. ఆయన రూపొందించిన చిత్రం విడుదల కావాల్సి ఉంది.

బీఏ రాజు విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. సీనియర్ జర్నలిస్టు మోహన్ కుమార్ వద్ద శిష్యరికం చేశారు. మోహన్ కుమార్ ప్రోత్సాహంతోనే ఆయన సినీ జర్నలిస్టుగా మారారు. దాదాపు 35 ఏళ్లుగా జర్నలిస్టుగా కొనసాగారు. కృష్ణతోపాటు మహేష్ బాబు కూడా అభిమానిగా మారారు. సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. సినీయర్ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో వాళ్ళతో మంచి అనుబంధం ఉంది.

కృష్ణ కుటుంబంలోని హీరోల సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రచయిత ఘటికాచలం దర్శకత్వంలో ప్రేమలో పావణి కల్యాణ్ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. ఆ తరువాత తన భార్య, జర్నలిస్టు బీ జయ దర్శకత్వంలో చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలను నిర్మించారు.
బీఏ రాజుకు కృష్ణ అభిమానిగానే కాకుండా పీఆర్వోగా ఆపారమైన అనుబంధం ఉంది. 1987 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1000కిపైగా చిత్రాలకు పీఆర్వోగా వ్యవహరించారు. ప్రస్తుతం అఖండ, నారప్ప, సర్కారు వారీ పాట, పెళ్లి సందడి, సీటీమార్, శాకుంతలం సినిమాలకు పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు.

Also Read : బీఏ రాజు మరణంపై ప్రముఖులంతా ఎమోషనల్ ట్వీట్లు..

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న వర్మ హీరోయిన్..

Previous articleచిరంజీవి చేసిన సాయానికి ఎమోషనల్ అయిన నటుడు..
Next articleబీఏ రాజు మరణంపై ప్రముఖులంతా ఎమోషనల్ ట్వీట్లు..