Home జాతీయ వార్తలు వ్యాక్సిన్ వేసుకో..బీరు అందుకో

వ్యాక్సిన్ వేసుకో..బీరు అందుకో

76
0
Central Govt Deal Get Second India Vaccine 30 Crore Doses Booked
Central Govt Deal Get Second India Vaccine 30 Crore Doses Booked

దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ప్రపంచ దేశాల్లో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటువంటి తరుణంలో కరోనా ఇకపై ఎవ్వరికీ రాకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. భారత దేశంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారు వ్యాక్సిన్ ఇంకా వేసుకోలేదు. అయితే అమెరికాలో అలా కాదు. అమెరికాలోని ప్రజలందరూ టీకాలు వేసుకోవాలని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పింది. చాలా మందికి టీకాలు వేసుకోవడం ఇష్టం లేదు. వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని టీకా వేసుకోవడానికి కొందరు వెనకడుగు వేస్తున్నారు. 

Another India Made Vaccine

టీకాలు వేసుకోకపోవడం వల్ల అమెరికా ప్రభుత్వం కొన్ని ఆఫర్ల ద్వారా వ్యాక్సిన్లు వేయాలని చూస్తోంది. దేశంలోని ప్రజలకందరికీ వ్యాక్సిన్లు పుష్కలంగా ఉన్నాయని, అయితే చాలా మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావడం లేదని అమెరికా అభిప్రాయపడుతోంది. అందరికీ వ్యాక్సిన్లు వేసేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. 

అమెరికాలోని ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని డ్రింక్ ఆఫర్ ను ముందుకు తెచ్చింది. ఇందుకోసం అన్ హైజర్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న యువత కోసం ఈ బంపరాఫర్ ను ప్రకటించడంతో అందరూ ముందుకు వస్తున్నారు. వెబ్ సైటులో తమ పేర్లను నమోదు చేసుకుని ఉన్న రెండు లక్షల మంది ప్రజలకు బీరును ఫ్రీగా ఇస్తోంది. ఒక్కోక్కరికి కూడా ఐదు డాలర్లు బీరును అందిస్తూ ఆఫర్ ను ప్రకటించింది. దీంతో ప్రజలు ఇలాగైనా వ్యాక్సిన్ వేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Read Also: AP News | TG News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఈ టెస్ట్‌తో గుండెనొప్పి గురించి ముందే తెలుసుకోవచ్చు..ఆ టెస్ట్ ఏంటంటే
Next articleతెలంగాణ ప్రజలకు అలర్ట్..మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు