Home Covid 19 SBI కస్టమర్లకు అలర్ట్..ఆ పని చేయకుంటే యమ డేంజర్

SBI కస్టమర్లకు అలర్ట్..ఆ పని చేయకుంటే యమ డేంజర్

113
0
SBI Alert For Customers
SBI Alert For Customers

మీ ఆధార్ కార్డుతో పాన్‌కార్డు లింక్ అయిందా లేదా? ఒకవేళ కాకపోతే వెంటనే లింక్ చేసుకోండి. చివరి తేదీ దగ్గర పడుతోంది. ఒకవేళ చేయకపోతే పాన్‌కార్డు రద్దై పోతుంది. పాన్‌కార్డు ఆధార్ కార్డు లింక్ చేయడం ఓ తప్పనిసరి ప్రక్రియ. ఆధార్ కార్డు, పాన్‌కార్డులో అందించిన సమాచారం ఒకదానికొకటి సరిపోకపోతే అదో సమస్యగా మారుతుంది. ముఖ్యంగా పేరు, పుట్టిన తేదీ, వంటి ముఖ్యమైన సమాచారం పాన్‌కార్డు, ఆధార్ కార్డుల్లో వేర్వేరుగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇవి సరి చూసుకోవల్సిన అవసరముంది. ఆ సమాచారం సరిగ్గా లేకపోతే అభ్యర్ధన రిజెక్ట్ అవుతుంది. 

ఒకవేళ సమాచారం సరిపోకపోతే పాన్ ఆధార్ లింకింగ్ ప్రక్రియకు సంబంధించిన అభ్యర్ధన రిజెక్ట్ అయితే బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణను ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే.. పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ జూన్ 30 వరకు గడువు పొడిగించింది. పాన్, ఆధార్ లింకింగ్‌కు ఇంకా నెల రోజుల పాటు గడువుంది. పాన్, ఆధార్ లింకింగ్ నేపథ్యంలో కస్టమర్లను ఎస్‌బీఐ అలర్ట్ చేసింది.  జూన్ 30లోగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని కోరుతోంది. ఒకవేళ జూన్ 30 లోగా పాన్, ఆధార్ లింక్ చేయకపోయినా, పాన్ కార్డు యాక్టీవ్‌గా లేకపోయినా లావాదేవీల్లో పాన్ నెంబర్‌ను వెల్లడించకూడదని ఎస్‌బీఐ తెలిపింది. 

SBI Alert For Customers

ఇప్పటికీ ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డ్ హోల్డర్లు లక్షల్లో ఉంటారని కేంద్ర నివేదికలు తెలుపుతున్నాయి. పాన్ కార్డ్ హోల్డర్లు జూన్ 30 లోగా తమ పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయాలి. లేకపోతే జూలై 1 నుంచి పాన్ కార్డ్ ఇనాక్టీవ్‌గా అయిపోతుందని ఎబ్బీఐ తమ కస్టమర్లను హెచ్చరిస్తోంది. ఆధార్ లింక్ చేయని పాన్ నెంబర్లను ఎక్కడా లావాదేవీల సమయంలో వెల్లడించకూడదు. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డ్ చెల్లనిదిగా మారిపోతే అనేక ఆర్థికపరమైన లావాదేవీలు జరగకపోవచ్చు. ఒకవేళ ఆధార్ లింక్ చేయని పాన్ నెంబర్ ఎక్కడైనా ఉపయోగిస్తే జరిమానా చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు సెలవిస్తోంది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleతెలంగాణ ప్రజలకు అలర్ట్..మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
Next articleశుభవార్త..భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు