Home సినిమాలు బీఏ రాజు మరణంపై ప్రముఖులంతా ఎమోషనల్ ట్వీట్లు..

బీఏ రాజు మరణంపై ప్రముఖులంతా ఎమోషనల్ ట్వీట్లు..

216
2
celebrities-emotional-tweets-on-ba-raju

శుక్రవారం సాయంత్రం షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గులు కావడం, గుండెపోటు గురి కావడంతో తుదిశ్వాస విడిచారని, నా తండ్రి బీఏ రాజు ఆకస్మికంగా మరణించారని తెలియజేయడానికి చాలా బాధగా, విషాదంగా ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. పేరుకు తగ్గట్టుగా బతికినంత కాలం వారు రాజుగానే ఉన్నారు. మా గుండెల్లో సూపర్‌హిట్‌గానే ఉంటారు అని ట్వీట్‌లో తెలిపారు. ఆయన భార్య, సినీ దర్శకురాలు బీ జయ ఆగస్టు 30, 2018 తేదీన మరణించారు. వరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శివకుమార్ దర్శకత్వం బాధ్యతలు ఇటీవలే చేపట్టారు. ఆయన రూపొందించిన చిత్రం విడుదల కావాల్సి ఉంది. దీంతో సినీ లోకం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక, బీఏ రాజు మరణంపై ప్రముఖులంతా ఎమోషనల్ అవుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఎవరెలా స్పందించారో చూడండి!

ఎన్టీఆర్ బీఏ రాజు మరణంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ‘బీఏ రాజు గారి మరణ వార్త నన్ను షాక్‌కు గురి చేసింది. ఫిల్మ్ జర్నలిస్టుగా, పీఆర్ఓగా ఆయన సేవలు మర్చిపోలేనివి. నా కెరీర్ ఆరంభం నుంచి ఆయన నాకు తెలుసు. చిత్ర పరిశ్రమకు ఇది లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా’ అంటూ పేర్కొన్నాడు.

కల్యాణ్ రామ్ బీఏ రాజు మృతిపై నందమూరి కల్యాణ్ రామ్ స్పందిస్తూ… ఈ మేరకు తన ట్విట్టర్‌లో ‘ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్, పీఆర్ఓ బీఏ రాజు గారు మరణించారన్న వార్త నన్ను షాక్‌కు గురి చేసింది. ఆయన నాతో కలిసి ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ఏళ్లుగా పని చేశారు. ఇది సినీ ఇండస్ట్రీలోకి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా’ అంటూ తెలియజేశాడు. 

 నాగ శౌర్య బీఏ రాజు మరణంపై నాగ శౌర్య స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ‘బీఏ రాజు గారి ఆకస్మిక మరణంతో షాక్ అయ్యాను. ఫీల్డ్ జర్నలిజంలో ఆయన ఒక లెజెండ్. మా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటూ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని మిస్ అవుతున్నాం సార్’ అంటూ వెల్లడించాడు.

బీఏ రాజు… నువ్వు లేని తెలుగు సినిమా మీడియా మరియు పబ్లిసిటీ, ఎప్పటికీ లోటే… తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ ప్రముఖ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బీఏ రాజు మృతిపై స్పందించి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి బీఏ రాజు ఆకస్మిక మరణంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘బీఏ రాజు గారి మరణ వార్త నన్ను తీవ్ర వేదనకు గురి చేసింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నా’ అంటూ సుదీర్ఘమైన లేఖను రాశారు. అందులో ఆయన అన్ని రికార్డులను కచ్చితంగా చెప్పగలిగే నాలెడ్జ్ బ్యాంక్ అంటూ కొనియాడారు చిరు. ఇందులో ఎన్నో విషయాలను గుర్తు చేసుకున్నారు.

యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ బీఏ రాజు మృతిపై స్పందించారు. ‘ఉదయాన్నే భయంకరమైన వార్తను విన్నాను. నా పుట్టినరోజున ఆయనతో మాట్లాడాను. ఎప్పుడూ ధైర్యం చెబుతూ ప్రోత్సహించేవారు. యాంకర్‌గా చేసినప్పటి నుంచి నాకు అండగా ఉన్నారు. ఆయన ఉంటే ధైర్యంగా ఉండేది. నేను ఆయనను బారాజుగారు అనేదాన్ని’ అంటూ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చింది.

అక్కినేని సమంత బీఏ రాజు ఆకస్మిక మరణంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘బీఏ రాజు గారు నా జీవితంలో సానుకూల వెలుగులు నింపేవారు. నా మొదటి చిత్రం నుంచి ప్రతి దానికి ఇదే చేశారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా నా వెంటే ఉన్నారు. నేను మిమ్మల్సి భయంకరంగా మిస్ అవుతున్నా సార్. ఇది తీరని లోటు’ అంటూ ఎమోషనల్ అయిందామె.

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బీఏ రాజు మృతిపై స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘హో.. నో.. ఇది చాలా విచారకరమైన వార్త. రాజు గారూ మీ గొప్ప సేవలను సినీ పరిశ్రమ కోల్పోయింది. అందరికీ నిత్యం అందుబాటులో, అండగా ఉన్న మీకు ధన్యవాదాలు. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. మిమ్మల్ని మిస్ అవుతున్నా’ అంటూ పేర్కొన్నాడాయన.

దర్శకధీరుడు రాజమౌళి బీఏ రాజు ఆకస్మిక మరణంపై స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘బీఏ రాజు గారి ఆకస్మిక మరణ వార్తకు నిజంగా షాక్ అయ్యాను. సీనియర్ మెంబర్‌ను కోల్పోయాం. 1500 లకు పైగా సినిమాలకు పీఆర్ఓ గా, ఫిల్మ్ జర్నలిస్టు గా చేసిన ఆయనను కోల్పోయాం. మీ లోటును ఎవరూ పూడ్చలేరు’ అంటూ చెప్పుకొచ్చాడు జక్కన్న.

నరేష్ బీఏ రాజు మృతిపై అల్లరి నరేష్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘బీఏ రాజు గారి మరణ వార్త విని నిర్ఘాంతపోయాను. ఆయన ఎన్నో సినిమాలకు మార్గదర్శిలా పని చేశారు. ప్రతి ఒక్కరితోనూ పర్సనల్ బందాన్ని ఏర్పరచుకున్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా సార్’ అంటూ ట్వీట్ చేశాడు.

రామ్ పోతినేని బీఏ రాజు ఆకస్మిక మరణంపై స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘ఆ నవ్వుల ముఖాన్ని.. ఆ సానుకూల బలాన్ని.. ప్రోత్సహించే ఆ మాటలను.. ఎప్పటికీ మర్చిపోలేము. మీరు ఎంతో సహృదయులు. మిమ్మల్ని మిస్ అవుతాం రాజుగారూ. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు.

Also Read : సీనియర్ జర్నలిస్టు, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో మృతి

చిరంజీవి చేసిన సాయానికి ఎమోషనల్ అయిన నటుడు..

Previous articleసీనియర్ జర్నలిస్టు, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో మృతి
Next articleవ‌ర్మ కామెంట్స్‌ – ప్ర‌భుత్వాలు ఫార్మా కంపెనీల‌కు ఫండ్స్ ఇవ్వ‌డం మానేసి ఆనంద‌య్య‌కు ఇవ్వాలి.