Home సినిమాలు జిమ్ లో రచ్చ చేస్తోన్న వర్మ, ఆరియానా..కొత్త సినిమాకు ప్లాన్ చేస్తున్నారా?

జిమ్ లో రచ్చ చేస్తోన్న వర్మ, ఆరియానా..కొత్త సినిమాకు ప్లాన్ చేస్తున్నారా?

196
0
RGV And Bigg Boss Fame Ariyana Workouts
RGV And Bigg Boss Fame Ariyana Workouts

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది నెలలుగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఆరియానా గ్లోరీ ఒకటి. దీనికి కారణం ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో చేసిన హడావిడే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ బ్యూటీ అందులో రచ్చ రచ్చ చేసింది. ఇక, బయటకు వచ్చిన తర్వాత కూడా పలు ఇంటర్వ్యూలు, సినిమా ఆఫర్లు, షోలలో కనిపిస్తూ హల్‌చల్ చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. గతంలో వర్మ ఇంటర్వ్యూతో ఆరియానా వెలుగులోకి వచ్చింది. ఆ టైంలో వర్మ..నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ కామెంట్స్‌ చేయడంతో  ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. 

ఆ తర్వాత ఆరియానా ఓవర్ నైట్ స్టార్ లో స్టార్ గా మారిపోయింది. ఇకపోతే తాజాగా వర్మతో ఆరియానా దిగిన ఫోటోలు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో బిగ్ బాస్ అరియానా స్పోర్ట్స్ బ్రాలో దర్శనమివ్వగా ఆమె వెనకాల రామ్ గోపాల్ వర్మ డంబుల్స్ పట్టుకుని వర్కౌట్ చేస్తున్నట్లు కనిపించాడు. అంతేకాకుండా ఈ బిగ్ బాస్ లిటిల్ బ్యూటీ అరియానా గ్లోరీ నన్ను జిమ్ లో ఉండగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందని ఫోటోకు ట్యాగ్ కూడా చేశాడు. దీనిపై ఫ్యాన్స్ రకరకాలుగు కామెంట్ చేస్తున్నారు. ఆరియానాకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వనున్నారా అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleసీఎం కేసీఆర్ పై ఈట‌ల ఫైర్..కౌంట‌ర్ ఇచ్చిన పల్లా
Next articleలాక్ డౌన్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు..రోడ్డుపై కనిపిస్తే ఐసోలేషన్ కు తరలింపు