Home జాతీయ వార్తలు RBI కీలక ప్రకటన..ఆ వడ్డీ రేట్లలో మార్పు లేదు

RBI కీలక ప్రకటన..ఆ వడ్డీ రేట్లలో మార్పు లేదు

141
0
RBI Announced Key Changes In Interest Rates
RBI Announced Key Changes In Interest Rates

కరోనా నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చర్చించిన తర్వాత కీలకమైన వడ్డీ రేట్లలో మార్పులేవీ చేయలేదని తెలిపింది. రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కార్యక్రమంలో ఆయన ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎంఎస్ఎఫ్), బ్యాంకు రేట్లు కూడా 4.25 శాతంగా ఉండనున్నాయని ఆయన తెలిపారు. 

రెపో రేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఆరోసారి అని తెలుస్తోంది. మ‌రోవైపు 2022 ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను జీడీపీ వృద్ధి రేటు అంచ‌నాను 9.5 శాతానికి ఆర్బీఐ త‌గ్గించింది. గ‌తంలో ఇది 10.5 శాతంగా ఉండేదని ఆర్బీఐ అంచ‌నా వేసింది. ఇక తొలి త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటును గ‌తంలో 26.2 శాతంగా అంచ‌నా వేసినా తాజాగా దానిని 18.5 శాతానికి త‌గ్గించినట్లు ఆర్బీఐ తెలిపింది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleకోవిడ్ పై పోరులో స్వదేశీ టీకా..భారత శాస్త్రవేత్తలను ప్రశంసించిన మోదీ
Next articleఏడాదిన్నర బాలుడికి బ్లాక్‌ ఫంగస్‌..కాపాడిన డాక్టర్లు