Home సినిమాలు పోలీసులకు చిక్కిన అషు రెడ్డి, రాహుల్… వాళ్ల రియాక్షన్ చూస్తే!

పోలీసులకు చిక్కిన అషు రెడ్డి, రాహుల్… వాళ్ల రియాక్షన్ చూస్తే!

227
0
police caught ashu and rahul sipligunj

తెలుగు రాష్ట్రాల్లో వీళ్లిద్దరి గురించి కొంత కాలంగా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో వల్ల వీళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించడం.. ఆ తర్వాత తరచూ కలుసుకోవడం.. పార్టీలు చేసుకోవడం వంటి వాటితో వార్తల్లో నిలుస్తునే ఉన్నారు. ఆ మధ్య తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్ స్వయంగా చెప్పడంతో ఈ మేటర్ హైలైట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అషు రెడ్డి, రాహుల్ సిప్లీగంజ్ పోలీసులకు దొరికిపోయారు. దీంతో ఈ జంట మరోసారి హాట్ టాపిక్ అయింది. వైజాగ్‌లో పుట్టి పెరిగిన అషు రెడ్డి, గ్రాడ్యుయేషన్ కోసం యూఎస్ వెళ్లింది. అక్కడ పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా చేసింది. ఆ సమయంలోనే ఒకరితో ప్రేమలో కూడా పడింది. కానీ, కొద్ది రోజుల్లోనే అది బ్రేకప్ అయిపోవడంతో, ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం జరిగింది. దీంతో మందులు వాడడం వల్ల చాలా బొద్దుగా మారిపోయింది. ఈ విషయాన్ని అషు రెడ్డినే స్వయంగా వెల్లడించింది.

ఇకా రాహుల్ సిప్లీగంజ్ విషయానికి వస్తే… బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లిన అతడు.. హౌస్‌లో పునర్నవి భూపాలంతో కలిసి రచ్చ రచ్చ చేశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత హగ్గులు, ముద్దులతో ఈ జంట హల్‌చల్ చేసింది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం కూడా జరిగింది.

రాహుల్ సిప్లీగంజ్ బిగ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పునర్నవి భూపాలంతో కలిసి రచ్చ చేశాడు. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలు, ఇంటర్వ్యూలలో ఆమెతో కలిసి పాల్గొన్నాడు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఆ సమయంలో రాహుల్ వ్యాపారంలో బిజీ అయిపోయాడు. పునర్నవి సొంతం పనులు చేసుకుంటోంది. బిగ్ బాస్ తర్వాత పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతోంది అషు రెడ్డి. ఈ క్రమంలోనే తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌కు సైతం వెళ్తోంది. ఇలానే కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్‌తో డిన్నర్ డేట్‌కు వెళ్లింది. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వదిలిన అతడు.. తామిద్దరం రియల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ప్రకటించి బాంబ్ పేల్చాడు.

బిగ్ బాస్ విన్నర్ రాహుల్ చేసిన పోస్టుపై తాజాగా అషు రెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతడితో దిగిన ఫొటోను షేర్ చేసి.. సమయం వస్తుంది. నిజాలన్నీ అప్పుడే తెలుస్తాయి’ అంటూ  క్యాప్షన్ పెట్టింది. దీంతో అసలేం జరిగిందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. దీనికి ‘సమయం ఎప్పుడు వస్తుంది బేబీ’ అంటూ రిప్లై ఇచ్చాడు రాహుల్ సిప్లీగంజ్. ఊకో కాకా పేరిట బట్టల వ్యాపారాన్ని ప్రారంభించి ఫుల్ బిజీగా మారిపోయాడు రాహుల్ సిప్లీగంజ్. అదే సమయంలో యాంకర్‌గా, యాక్టర్‌గా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది అషు రెడ్డి. వీళ్లిద్దరూ తమ పనులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో వీళ్లిద్దరూ.. పోలీసులకు చిక్కారు. అయితే, ఇది జంటగా జరిగింది కాదు.. విడివిడిగానే పట్టుబడ్డారు.

అషు రెడ్డి.. రాహుల్ సిప్లీగంజ్ హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులకు విడివిడిగా పట్టుబడ్డారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ఫొటోలతో సహా షేర్ చేశాడు. దీన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రాహుల్.. ‘త్వరగా చలాన్ కట్టేయ్.. లేకుంటే మళ్లీ ఫైన్ పడుతుంది’ అని పోస్ట్ పెట్టాడు. దీనిపై స్పందించిన అషు ‘నాది కూడా నువ్వే కట్టు’ అంటూ రిప్లై ఇచ్చింది.

Also Read : మహేష్ బాబు ” సర్కార్ వారి పాట” పై భారీ అంచనాలు

Previous articleకరోనాతో బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తల్లి మృతి…
Next articleచిరంజీవి చేసిన సాయానికి ఎమోషనల్ అయిన నటుడు..