Home జాతీయ వార్తలు వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన చెడ్డ తల్లి కాదు

వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన చెడ్డ తల్లి కాదు

96
0
Punjab And Haryana High Court Sensational Decision On Extra Marital Affairs
Punjab And Haryana High Court Sensational Decision On Extra Marital Affairs

వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చపెడుతుంటాయి. చాలా మంది ఈ వ్యసనంతో తమ జీవితాలను తారుమారు చేసుకుంటుంటారు. అయితే ఇక్కడే ఓ నిజమైన అగ్ని కణం ఉంది. వివాహేతర సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది. దాని వెనక ఉన్న పరిణామాలేంటి. పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు ఈ చిక్కుముడిలో చిక్కుకుని తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కోర్టు ఈ సంబంధం గురించి ఓ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది.

తమ పిల్లల సంతోషం కోసం, ఆనందం కోసం తల్లులు ఏం చేయడానికైనా సిద్దపడుతారు. పంజాబ్‌, హరియాణా కోర్టులు దీనిపై వ్యాఖ్యలు చేశాయి. వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన ఓ మహిళను చెడ్డ తల్లిగా పరిగణించలేము అని వ్యాఖ్యనించడమే కాక నాలుగున్నరేళ్ల కుమార్తె కస్టడీని తల్లికి అప్పగించింది. వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ భర్త తన దగ్గర నుంచి కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లడంతో పంజాబ్‌కు చెందిన ఓ మహిళ హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ దాఖలు చేసింది. 

దీని విచారణ సందర్భంగా జస్టిస్‌ అనుపిందర్‌ సింగ్‌ గ్రెవాల్‌ మాట్లాడుతూ స్త్రీకి వివాహేతర సంబంధం ఉన్నా దాన్ని ఆధారంగా చేసుకుని ఆమె మంచి తల్లి కాదని అనడానికి కానీ పిల్లలను ఆమె నుంచి దూరం చేయడం కానీ జరగదని స్పష్టం చేశారు. పంజాబ్‌కు చెందిన ఫతేగార్‌ సాహిబ్‌కు, లుధియానాకు 2013లో వివాహం జరిగింది. 2017లో ఓ కుమార్తె పుట్టింది. పిటీషన్‌దారైన మహిళ 2020, ఫిబ్రవరిలో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను చూడ్డానికి వచ్చినప్పుడు ఆమె దగ్గర నుంచి కుమార్తెను బలవంతంగా వేరు చేశారు.

మైనర్‌ కుమార్తె బాధ్యతను తనకు అప్పగించేలా తన భర్తను ఆదేశించాల్సిందిగా కోర్టును కోరింది. అంతేకాక సదరు మహిళ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కుమార్తె కస్టడీని కోరుతూ.. ఫెడరల్‌ సర్క్యూట్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. మైనర్ బిడ్డను మహిళకు తిరిగి ఇవ్వమని ఆస్ట్రేలియా కోర్టు భర్తను ఆదేశించింది. 

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleనెట్టింట్లో సీఎం కేసీఆర్ దంపతుల ఫోటో..ట్వీట్ చేసిన మనమడు హిమాన్షు..వైరలవుతోన్న పెయింటింగ్
Next articleనడి రోడ్డుపై దారుణం..గొడ్డలితో భార్యను నరికి ఈడ్చుకెళ్లిన కిరాతకుడు