Home సినిమాలు ఆ హీరోతో రోమాన్స్ చేసే ఛాన్స్..మనసులో మాట బయటపెట్టిన ప్రియమణి

ఆ హీరోతో రోమాన్స్ చేసే ఛాన్స్..మనసులో మాట బయటపెట్టిన ప్రియమణి

118
0
Priyamani About Hero Venkatesh
Priyamani About Hero Venkatesh

ప్రియమణి అంటే తెలుగు కుర్రకారుకు చాలా ఇష్టం. టాలీవుడ్ లో ఈ అమ్మడు ఓ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అటు అందంతో ఇటు అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. అయితే పెళ్లి చేసుకుని సినిమాలకు కొంత విరామం ఇచ్చింది. తాజాగా ప్రియమణి రెండు సినిమాల్లో నటించే అవకాశం పొందింది. ఈ మధ్యనే జరిగి ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి చాలా రోజుల నుంచి దాచుకున్న తన మనసులోని మాటలను ఓపెన్ హార్ట్ తో చెప్పేసింది.

యమదొంగ సినిమాతో హీరోయిన్‌గా పాపులర్ అయిన ప్రియమణి ఆ తర్వాత చేసిన సినిమాలు ఆ స్థాయిలో సక్సెస్‌ కాలేదు. దీంతో టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అదే సమయంలో ఆమె కన్నడ, మలయాళ చిత్రాలను దృష్టిపెట్టి అక్కడ బిజీ అయ్యింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోన్న ప్రియమణి మళ్లీ కొంత గ్యాప్‌ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. 

ప్రస్తుతం ‘విరాటపర్వం’ సినిమాతో పాటు విక్టరీ వెంకటేష్ సరసన ‘నారప్ప’ సినిమాలోనూ ప్రియమణి నటించింది. తమిళంలో ‘అసుర‌న్‌’ పేరుతో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాను తెలుగులో ‘నారప్ప’గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇందులో వెంకటేష్ భార్యగా ప్రియమణి కనిపించనుంది. ఈ రెండు సినిమాలపై ఆమె మాట్లాడుతూ ఈ రెండు ప్రాజెక్ట్స్ తన కెరీర్‌‌లో మైల్ స్టోన్స్ అవుతాయని చెప్పుకొచ్చింది. సీనియర్ హీరో వెంకటేష్‌తో నటించే అవకాశం ఇదివరకూ తనకు మూడుసార్లు వచ్చిందని అయితే కొన్ని కారణాలరీత్యా వెంకీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. మళ్ళీ వెంకటేష్‌తో నటించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని, చాలా రోజుల నుంచి వెంకటేష్ తో నటించే తన కోరిక నెరవేరిందని తెలిపింది. 

Previous articleలాక్ డౌన్ రూల్స్ బ్రేక్..రూ.కోట్ల జ‌రిమానాలు ఎన్ని కోట్ల
Next articleమరో డేంజర్..ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి బర్డ్ ఫ్లూ