Home క్రీడలు ఒలింపిక్స్‌​ క్రీడల సంసిధ్దతపై మోదీ సమీక్ష..దేశం నుంచి ఎంతమంది బరిలోకి దిగుతున్నారంటే.

ఒలింపిక్స్‌​ క్రీడల సంసిధ్దతపై మోదీ సమీక్ష..దేశం నుంచి ఎంతమంది బరిలోకి దిగుతున్నారంటే.

219
0
PM Modi Review Meeting About Olympics
PM Modi Review Meeting About Olympics

వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌కు దేశీయ అథ్లెట్ల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అథ్లెట్లను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ప్రధాని సూచించినట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. మోదీ మాట్లాడుతూ.. మనదేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని, మన దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారని అభినందించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల శుభాకాంక్షలతో పాటు, దీవెనలు కూడా ఉంటాయని తెలిపారు. 

క్రీడా కారులందరికి వ్యాక్సినేషన్​తో పాటు, సరైన శిక్షణ , ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. మరోవైపు ఒలంపిక్స్ ను రద్దు చేయాలని 70 శాతం మంది ప్రజలు కోరుతున్నారు. ఒలింపిక్స్‌ ఆరంభ సమయానికి 90 శాతం మంది క్రీడాకారులకు టీకా కార్యక్రమం పూర్తవుతుందని, కఠిన ఆంక్షలు, బుడగల మధ్య క్రీడలు నిర్వహిస్తామని ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్స్‌ సంఘం ప్రకటించాయి. ఒలంపిక్స్ కు దేశం నుంచి 11 క్రీడా విభాగాలలో మొత్తం 100 మంది అథ్లెట్లు అర్హత సాధించారని తెలిపారు. అయితే, జూన్​ చివరి నాటికి మరో 25 మంది వివిధ క్రీడలకు అర్హత సాధించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వివరించారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleనడి రోడ్డుపై దారుణం..గొడ్డలితో భార్యను నరికి ఈడ్చుకెళ్లిన కిరాతకుడు
Next articleషర్మిల కొత్త పార్టీ పేరు వెల్లడి..అధ్యక్షుడు ఎవరంటే