Home జాతీయ వార్తలు వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రానిదే : ప్రధాని మోదీ

వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రానిదే : ప్రధాని మోదీ

265
0
PM Modi About Vaccination On India
PM Modi About Vaccination On India

వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రానిదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా ఈ శతాబ్దంలోనే ఘోరమైన విషాదంగా అభివర్ణించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ చరిత్రలోనే ఆక్సిజన్ కొరత ఇంతలా ఎప్పుడూ వేధించలేదనీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సహకారంతో విదేశాల నుంచి త్వరితగతిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రప్పించామనీ అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయన్నారు. దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు తగిన సహకారం కేంద్రం అందించిందన్నారు. స్వదేశీ వ్యాక్సిన్ల ఉత్పత్తితో ప్రపంచానికి భారత్ తన సత్తా చాటిందన్నారు.

విదేశీ వ్యాక్సిన్లపై ఆధారపడి ఉంటే మరో రెండేళ్లు పట్టేదన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది కావాల్సిన వారిని పోగొట్టుకున్నామన్నారు. వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ కోసం గత ఏప్రిల్ లోనే కేంద్రం కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్థూలంగా మార్గదర్శకాలను ఇచ్చిందని వివరించారు. వ్యాక్సినేషన్ కష్టనష్టాలు రాష్ట్ర ప్రభుత్వాలకు అర్థం అయిందన్నారు. కోవిద్ పై పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని, వ్యాక్సినేషన్ ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. వ్యాక్సినేషన్ కోసం ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇస్తుందని అన్నారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleక్రికెట్ చరిత్రలోనే ఇదొక చెత్త రికార్డ్..20 ఓవర్లలో ఒకే ఫోర్
Next articleచుక్కల ముందుకు హైకోర్టు అనుమతి