Home జాతీయ వార్తలు వాహనదారులకు షాక్..మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర

వాహనదారులకు షాక్..మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర

102
0
Petrol And Diesel Price Hike Today
Petrol And Diesel Price Hike Today

దేశంలో కరోనా వల్ల ఆర్థిక పరంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇటువంటి సమయంలో దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం వల్ల పేదలు, సామాన్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే పప్పు, నూనె ధరలు అటుంచితే గ్యాస్ ధరల బాదుడు కూడా అలాగే ఉంది. మరోవైపు వాహనదారులు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం వల్ల వాహనాలలో వెళ్లడానికి జంకుతున్నారు.

ఆయిల్ కంపెనీలు నష్టాల భారిన పడకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ధరలపై వ్యాట్ వేస్తూ మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు బండిపై వెళ్లడం అంటే దారుణమైన స్థితిగా పరిగణిస్తున్నారు. 

పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని ప్రాంతాల్లో లీటర్ వంద దాటడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. శుక్రవారం కూడా ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు చమురు ధరలను పెంచేశాయి. దీంతో ముంబైలో పెట్రోలు ధర 101 మార్క్‌ను చేరుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గణాంకాల ప్రకారం పెట్రోల్ ధరను లీటరుకు 27 పైసలు, డీజిల్ 28 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీ లీటరు పెట్రోల్ ధర. 94.76,  డీజిల్ ధర. 85.66గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్,  మహారాష్ట్రలోని పలు నగరాల్లో లీటరు పెట్రోలు ధర 100 దాటడంతో వాహనదారులు జేబులను గుల్ల చేసుకుంటున్నారు.

పలు నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముంబైలో పెట్రోల్ ధర రూ. 100.98 , డీజిల్ 92.99, చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధర రూ. 96.23, డీజిల్‌ ధర.90.38, కోల్‌కతాలో  పెట్రోల్‌ ధర రూ.94.76, డీజిల్‌ రూ.88.51, హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.98.48, డీజిల్‌ రూ. 93.38, అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.100.93,  డీజిల్‌ రూ.95.23, వైజాగ్‌లో పెట్రోల్‌ ధర రూ.99.69, డీజిల్‌ రూ.94.03గా ఉంది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా
Next articleవ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు షాక్..జీతాలు కట్ చేస్తూ సీఎం సంచలన ఆదేశాలు