Home తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఈట‌ల ఫైర్..కౌంట‌ర్ ఇచ్చిన పల్లా

సీఎం కేసీఆర్ పై ఈట‌ల ఫైర్..కౌంట‌ర్ ఇచ్చిన పల్లా

90
0
Palla Rajeswar Reddy Counter On Etela Comments
Palla Rajeswar Reddy Counter On Etela Comments

తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. టీఆర్ఎస్ కు ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై, అందులోని నాయకులపై ఆరోపణలు చేశారు. తనపై టీఆర్ఎస్ లోని బడా నాయకులు చేసిన కుట్రలను బయటపెట్టారు. ఒక అనామకుడు ఇచ్చిన ఫిర్యాదు కారణంగా తనను పార్టీ నుంచి తప్పించడం తప్పని చెప్పారు. సీఎం కేసీఆర్ పై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా సమావేశాన్ని ముగించారు. ఈ నేపథ్యంలో ఈటలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఈటల రాజీనామా వెనక ఓ పెద్ద కుట్రే ఉందని పల్లా అభిప్రాయపడ్డారు. తన ఆస్తుల రక్షణ కోసమే ఈటల రాజేందర్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈటలకు ఆత్మగౌరవం లేదన్నారు. 

అక్రమంగా ఆస్తులు సంపాదించడంలో ఈటల ముందుంటారని తెలిపారు. టీఆర్ఎస్ నుంచి ఎంతో మంది కేసీఆర్ పై నిప్పులు చెరగడం చూస్తూనే ఉన్నామన్నారు. పార్టీపై వారంతా ఆరోపణలు చేసినట్లు ఇప్పుడు ఈటల కూడా ఆరోపణ చేయడం తప్పని అన్నారు. పార్టీపై ఈట‌ల లేనిపోని నిందలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన‌వ‌స‌రంగా కేసీఆర్ పై నోరు పారేసుకుంటే సూర్యుడిపై ఉమ్మేసిన‌ట్టేనని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ప్ర‌జ‌లంద‌రూ టీఆర్ఎస్ వైపే ఉన్నార‌న్నారు. రైతు బంధు స్కీమ్ పై ఈటల చేసిన కామెంట్లు కావాలనే కుట్రపన్నే విధంగా ఉన్నాయన్నారు. ఈటల  చేసిన దురాక్రమాలు వెలుగులోకి రావడంతో ఆయనపై వేటు తప్పలేదని ఈ సందర్భంగా ఈటలకు పల్లా కౌంటర్ ఇచ్చారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఏడాదిన్నర బాలుడికి బ్లాక్‌ ఫంగస్‌..కాపాడిన డాక్టర్లు
Next articleజిమ్ లో రచ్చ చేస్తోన్న వర్మ, ఆరియానా..కొత్త సినిమాకు ప్లాన్ చేస్తున్నారా?