Home జాతీయ వార్తలు హైదరాబాద్ లో వింత.. ఆకాశంలో సూర్యని చుట్టూ అద్బుతం

హైదరాబాద్ లో వింత.. ఆకాశంలో సూర్యని చుట్టూ అద్బుతం

309
1
Miracle Incident Happened In Sky
Miracle Incident Happened In Sky

అసలే కరోనా టైం. అందులోనూ అందరూ ఇళ్లల్లోనే ఉంటారు. ఈ టైంలో ఆకాశంలో ఏదైనా కనిపిస్తే ఇక అంతే. ప్రజలు వింతగా చూడటం చేస్తారు. ఫొటోలు తీసుకుని షేర్ చేస్తుంటారు. ఇంకా ఆ వింత ఘటనకు సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతాయి. హైదరాబాద్ లో కూడా నేడు వింత ఘటన జరిగింది. ఆకాశంలో మామూలుగా అయితే సప్త వర్ణాల ఇంధ్రధనస్సు కనిపిస్తుంది. అయితే ఈసారి అలా కనిపించలేదు. మధ్యాహ్నం వేళ సూర్యుడి చుట్టూ వలయాకారం దర్శనమిచ్చింది. సూర్యుడికి చుట్టూర ఈ ఆకారము కనిపించడం వల్ల ప్రజలు వింతగా చూశారు.

భాగ్యనగరంలో ప్రజలు వింత ఆకారం చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా వాన కురిసే ముందుగా ఇటువంటివి ఏర్పడే అవకాశం ఉంది. గాలిలో ఉన్న నీటి అనువులు క్రిస్టల్ గా మారిపోయి సూర్యకాంతికి ఇంధ్ర ధనస్సు అనేది ఏర్పాటు అవుతుంది. ఆకాశంలో ఈ వింతను చూసేందుకు ప్రజలు పోటీపడ్డారు. తమ మిద్దెలపైకి ఎక్కి, పెద్ద పెద్ద భవనాల పైకి చేరి వింతఆకారాన్ని స్మార్ట్ ఫోన్ లల్లో ఫోటోలు తీసుకున్నారు. 

Read Also: ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ తెలంగాణా న్యూస్ అంతర్జాతీయ వార్తలు జాతీయ వార్తలు కోవిడ్ 19 న్యూస్

Previous articleమోదీకి ఆరేళ్ల బాలిక కంప్లైంట్..పాప మాటలకు ఫిదా
Next articleకంట్లోనే ఆనందయ్య మందు ఎందుకు? నిపుణులు చెప్పిన సీక్రెట్స్ ఇదే