Home తెలంగాణ హైదరాబాద్‌ లో విజయవంతంగా మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌..పోటెత్తిన జనం

హైదరాబాద్‌ లో విజయవంతంగా మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌..పోటెత్తిన జనం

216
0
Mega Vaccination Drive In Hyderabad
Mega Vaccination Drive In Hyderabad

దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండటం వల్ల కరోనా కేసులు తగ్గుతున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్‌‌ కేంద్రంగా వ్యాక్సిన్ డ్రైవ్‌‌ నిర్వహించారు. ఒకేచోట 40 వేల మందికి వ్యాక్సిన్లు వేయడానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు.  దేశవ్యాప్తంగా చూస్తే మొదటి సారి ఈ మెగా డ్రైవ్‌‌ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచే ప్రజలు భారీగా వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చారు. సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌‌ డ్రైవ్‌‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సాధారణ యువతీ యువకులకు ఒకేసారి వ్యాక్సిన్ వేశారు. పోలీసులు, హెల్త్ సిబ్బంది కలిసి 3,500 మంది ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో విధులు నిర్వహించారు. 

టీకా కోసం వచ్చేవారు ఎదురు చూడకుండా 300 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కూకట్‌‌పల్లి, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి నుంచి హైటెక్స్​కు వెళ్లే వాహనాలు రోడ్లు వ్యాక్సిన్ డ్రైవ్ వల్ల ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్ అధికారిక వెబ్‌‌సైట్‌‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చేవిధంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గర్భిణుల కోసం నర్సింగ్‌‌ స్టేషన్లు, ప్రతి హ్యాంగర్‌‌లో ఓ అత్యవసర వార్డుతో పాటు 5 పడకలతో ఎమర్జెన్సీ హాస్పిటల్‌‌ను ఏర్పాటు చేశారు.  డ్రైవ్‌‌ను ప్రారంభించాక సైబరాబాద్ సీపీ సజ్జనార్, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు మాట్లాడారు. కరోనా నియంత్రణలో వ్యాక్సినేషన్ ముఖ్యమైన ఘట్టమని అన్నారు. 

థర్డ్ వేవ్ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి జంబో టీకా డ్రైవ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ వేసుకోవడం ఒక్కటే మార్గమని ఎస్సీఎస్సీ జనరల్‌‌ సెక్రటరీ కృష్ణ చెప్పారు. డ్రైవ్ ప్రారంభ వేడుకలో రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌‌వో స్వరాజ్య లక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్‌‌రెడ్డి, డాక్టర్ కృష్ణప్రసాద్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేశ్‌‌, తదితరులు పాల్గొన్నారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఈటలపై హరీశ్ రావు ఫైర్..తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి
Next articleఆ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువ యాంటీబాడీస్..వెలుగులోకి సంచలన నిజాలు