Home జాతీయ వార్తలు నడి రోడ్డుపై దారుణం..గొడ్డలితో భార్యను నరికి ఈడ్చుకెళ్లిన కిరాతకుడు

నడి రోడ్డుపై దారుణం..గొడ్డలితో భార్యను నరికి ఈడ్చుకెళ్లిన కిరాతకుడు

153
0
Man Assassinated Wife And Dragged Her Body On Road
Man Assassinated Wife And Dragged Her Body On Road

మనస్పర్దలే హత్యలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. కుటుంబ కలహాల వల్ల ఓ భర్త తన భార్యను అతిదారుణంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్ లోని కోటలో జరిగింది. రాజస్థాన్, కోట ప్రాంతానికి చెందిన సునీల్ వాల్మీకి ఆ ప్రాంత నివాసి అయిన సీమ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి వివాహనం జరిగి 15 ఏళ్లు అయ్యింది. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. పెద్ద కుమారుడు 9 వ తరగతి చదువుతున్నారు. చిన్నకొడుకుకు ఇప్పుడు 9 నెలల వయసు. అయితే గత కొన్నేల్లుగా ఈ దంపతుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. 

కుటుంబంలో ఏదో ఒక కలహంతో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం కూడా ఈ భార్యభర్తల మధ్య గొడవయ్యింది. ఆ టైంలో కోపానికి లోనైన భర్త తన భార్యను గొడ్డలితో విచక్షణారహితంగా నరికేశాడు. అంతటితో ఆగకుండా తన భార్య శవాన్ని రోడ్డుపై లాక్కెల్లాడు. జనం ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డారు. పెద్ద ఎత్తున జనం రావడం చూసి సునీల్ భయపడి పోలీసులకు లొంగిపోయాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని శవపంచనామా నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన చిన్న కుమారుడిని హాస్పిటల్ కు తరలించారు. ఆ పిల్లాడు కూడా బుధవారం ఉదయం కన్నుమూయడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం బిడ్డ ఒంటరివాడవడం చూసి స్థానికులు కంటతడి పెట్టారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleవివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన చెడ్డ తల్లి కాదు
Next articleఒలింపిక్స్‌​ క్రీడల సంసిధ్దతపై మోదీ సమీక్ష..దేశం నుంచి ఎంతమంది బరిలోకి దిగుతున్నారంటే.