Home జాతీయ వార్తలు మహాత్మాగాంధీ ముని మనవరాలికి 7 ఏళ్లు జైలు శిక్ష… కారణం ఇదే..

మహాత్మాగాంధీ ముని మనవరాలికి 7 ఏళ్లు జైలు శిక్ష… కారణం ఇదే..

157
0
Mahatma Gandhi Greater Grand Daughter
Mahatma Gandhi Greater Grand Daughter

నకిలీ బిల్లులు సృష్టించి ఓ వ్యాపారవేత్తను మోసం చేయడంతో మహాత్మా గాంధీ ముని మనుమరాలికి దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2015లో గాంధీజీ ముని మనవరాలు ఆశీష్ లతా రామ్ గోబిన్ దక్షిణాఫ్రికా లోని వ్యాపారవేత్త ఎస్ఆర్ మహారాజ్ ను కలిశారు. మూడు కంటైనర్ల లినెన్ ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఆ సరుకు నుంచి కొంత మొత్తం లాభం ఇస్తానని ఆయనని లతా రామ్ గోబిన్ నమ్మబలికారు. దీని కోసం ఆమె నకిలీ పత్రాలు చూపించి, దిగుమతి సుంకాన్ని కట్టేందుకు రూ.3.23 కోట్లు తీసుకున్నారని 2015లో బాధిత వ్యాపారవేత్త కోర్టులో కేసు వేశారు.

అయితే ఆ సరుకు రవాణా అంత అబద్దమని, తన నుంచి సొమ్ము కాజేసేందుకు ఇలా నాటకమాడారని బాధితుడు కోర్టుకు తెలియజేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు లతా కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ ఉదంతం తెలిసిన భారతీయులు ఏ దక్షిణాఫ్రికాలో అయితే గాంధీ పేదలకు సహాయం చేశారో, అదే దేశంలో ఆయన మునిమనుమరాలు మోసానికి పాల్పడి మహాత్ముని పరువు తీశారని బాధ పడుతున్నారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleదసరా ధమాక అక్టోబర్ 15న ఐపీఎల్ ఫైనల్
Next articleప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ