Home జాతీయ వార్తలు వారికి తీపికబురు చెప్పిన సీఎం.. ఇకపై ఇంటికే మద్యం

వారికి తీపికబురు చెప్పిన సీఎం.. ఇకపై ఇంటికే మద్యం

257
0
Liquor Home Delivery Delhi
Liquor Home Delivery Delhi

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ మందురాయుళ్లకు శుభవార్త చెప్పింది. దేశంలో మందుకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇటువంటి తరుణంలో సీఎం కేజ్రీవాల్ మద్యాన్ని ఇంటికే డెలివరీ చేసే ఏర్పాట్లు చేశారు. వివిధ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా మద్యాన్ని హొమ్ డెలివరీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 

కరోనా తగ్గుతున్న నేపథ్యంలో చాలా మంది మద్యం షాపుల వద్ద నిలబడి మళ్లీ కరోనాను వ్యాప్తి చేస్తే దాని వల్ల అనేక ఇబ్బందులనే తలెత్తే అవకాశం ఉంది. అందుకే కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కరోనా కేసులు ఢిల్లీలో తగ్గడం వల్ల జూన్ 1వ తేది నుంచి కొన్ని సడలింపులు చేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

ముందుగా ఈమెయిళ్లు, ఫ్యాక్సు లేదా యాప్ ద్వారా మద్యాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దగ్గర్లోని లిక్కర్ షాపుల వాల్లు హోమ్ డెలివరీ చేయనున్నారు. అయితే హోండెలివరీ చేయడానికి అన్ని షాపులకూ గ్రీన్ సిగ్నల్స్ లేదు. ఎల్-14 లైసెన్స్‌లు ఉన్న దుకాణాలకు మాత్రమే మద్యాన్ని హోమ్ డెలివరీ చేసే అనుమతి ఉందని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టం చేసింది. 

Also Read More : Latest Politics News in India | National News in Telugu | Latest Telangana Telugu News

Previous articleగ్యాస్ సిలిండర్ వాడేవారికి గుడ్ న్యూస్..భారీగా తగ్గిన ధర ఏంటంటే..?
Next articleజార్ఖండ్ లో వింత జీవి..ఏలియనే అంటున్న నెటిజన్స్