Home జాతీయ వార్తలు కిలేడీ డాక్టర్..పసిబిడ్డను రూ.16 లక్షలకు బేరం..అసలు విషయం తెలిసి పోలీసులే షాక్

కిలేడీ డాక్టర్..పసిబిడ్డను రూ.16 లక్షలకు బేరం..అసలు విషయం తెలిసి పోలీసులే షాక్

151
0
కిలేడీ డాక్టర్..పసిబిడ్డను రూ.16 లక్షలకు బేరం..అసలు విషయం తెలిసి పోలీసులే షాక్
కిలేడీ డాక్టర్..పసిబిడ్డను రూ.16 లక్షలకు బేరం..అసలు విషయం తెలిసి పోలీసులే షాక్

నేటి సమాజంలో ప్రతి ఒక్కటీ అమ్ముడుపోయే స్థితికి వచ్చింది. డబ్బు సంపాదన అనేది ప్రధాన లక్ష్యంగా మారిపోయింది. పుట్టే బిడ్డ దగ్గర నుంచి చనిపోయిన శవం వరకూ ప్రతి ఒక్కటీ బేరసారాల మధ్య సాగుతోంది. తాజాగా బెంగుళూరులో ఓ బిడ్డను అమ్మిన ఘటన వెలుగుచూసింది. పురిటినొప్పుల మధ్య వచ్చిన తల్లికి బిడ్డ లేదని తెలిశాక ఆమె తల్లడిల్లిపోయింది. ఈ ఘటన ఏడాది క్రితం బెంగుళూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరగడంతో కలకలం రేపింది. ఒక సంవత్సరం ముందు వాణి విలాస్ ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డ మాయమైంది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేసినప్పటికీ బిడ్డ ఆచూకీ తెలియదు.

పసిబిడ్డను రూ.16 లక్షలకు బేరం

సీసీటీవీ ఆధారంగా పోలీసులు తమ విచారణను కొనసాగించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అసలు ముద్దాయి ఎవరో తెలిసిపోయింది. ఓ ఆస్పత్రిలో పనిచేసే వైద్యురాలే బిడ్డను దొంగిలించినట్లు తేలింది. పసిబిడ్డను ఆ వైద్యురాలు రూ.16.50 లక్షలకు అమ్మేసినట్లు పోలీసులు తేల్చారు. 

బెంగళూరులోని చామరాజపేట జగజ్జీవన్ రామ్ నగర్ లో నవీద్ పాషా, హుస్నాబాను అనే భార్యభర్తలు జీవిస్తున్నారు. అయితే పురిటినొప్పుల మధ్య హుస్నాబాను కేఆర్ మార్కెట్ వద్ద ఉన్న వాణి విలాస్ గవర్నమెంటు హాస్పిటల్ లో చేరింది. ఆ రోజే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా ఆ ప్రభుత్వ హాస్పిటల్ కు ఎవ్వరినీ లోనికి రానివ్వరు. లోపలికి వెళ్లాలంటే కేవలం రోగుల కుటుంబీకులు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. సెక్యూరిటీ వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల ఎవ్వరినీ లోపలికి వెళ్లనివ్వరు. అటువంటి ఆస్పత్రిలో బిడ్డ మాయమవడం అందరినీ ఆందోళన కలిగించింది. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు వారికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అయితే పసిబిడ్డను ఒకామె తీసుకెళ్తున్నట్లు సీసీ ఫుటేజ్ లో కొన్ని సెకన్ల వీడియోలో బయటపడింది. 

పోలీసులు దాని ఆధారంగా దొంగిలించిన మహిళ స్కెచ్ ను వేయించారు. ఆ స్కెచ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అప్పుడే అసలు నిజం బయటపడింది. స్కెచ్ లో ఉన్న మహిళ ఎవరో కాదు ఓ మానసిక వైద్యురాలు. ఆమె బెంగళూరులోనే ఓ ప్రయివేటు హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ రష్మీ (34)గా నిర్దారించారు. 

కోప్పళకు చెందిన భార్యభర్తలు బిడ్డలు లేక బాధపడుతున్న సమయంలో వారికి డాక్టర్ రష్మీ అద్దె గర్బం గురించి చెప్పింది. అద్దె గర్భం ద్వారా బిడ్డను  పుట్టించడానికి రూ.16.50 లక్షలు అవుతుందని బేరమాడింది. దంపతుల వీర్యం, అండాలు సేకరించి ఓ మహిళ గర్బంలోకి ఇంజెక్షన్ చేసింది. ఆ టైంలో దంపతుల నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకుంది. అయితే పోలీసుల విచారణలో కోప్పళ దంపతుల ఆ వీర్యం, అండాలు వేరే మహిళ గర్బంలోకి పంపించలేదని తేలింది.

డబ్బుల కోసమే డాక్టర్ రష్మీ బిడ్డను ఎత్తుకెళ్లి వారికి ఇచ్చినట్లు తేలింది.  అయితే కోప్పళ దంపతులకు బిడ్డను దొంగిలించినట్లు తెలీదు. డాక్టర్ రష్మీ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది.  అయితే బిడ్డ కోసం పోలీసులు డీఎన్ ఏ పరీక్షలు చేయిస్తున్నారు. పోలీసులు డాక్టర్ రష్మీని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. లాక్ డౌన్ టైమ్ లో ఇలాంటి కేసు చేధించిన పోలీసులను బెంగళూరు పోలీసు కమీషనర్ కమల్ పంత్ అభినందించారు.

Previous articleసత్యయుగం వచ్చిందంటున్న ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్
Next articleగ్యాస్ సిలిండర్ వాడేవారికి గుడ్ న్యూస్..భారీగా తగ్గిన ధర ఏంటంటే..?