Home తెలంగాణ నెట్టింట్లో సీఎం కేసీఆర్ దంపతుల ఫోటో..ట్వీట్ చేసిన మనమడు హిమాన్షు..వైరలవుతోన్న పెయింటింగ్

నెట్టింట్లో సీఎం కేసీఆర్ దంపతుల ఫోటో..ట్వీట్ చేసిన మనమడు హిమాన్షు..వైరలవుతోన్న పెయింటింగ్

99
0
KTR Son Himanshu Impressed With The Painting Of Grand Father And Grand Mother
KTR Son Himanshu Impressed With The Painting Of Grand Father And Grand Mother

నెట్టింట సీఎం కేసీఆర్ ఫోటో ఒకటి హల్చల్ చేస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ఆ ఫోటో చూసి సంతోషం వ్యక్తం చేశాడు.  తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, కేసీఆర్ సతీమటణి శోభా దంపతుల పెన్సిల్ స్కెచ్ పెయింటింగ్ ఫోటోను మనమడు హిమాన్షు అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించాడు. ఆ పెయింటింగ్ వేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.

కరీంనగర్ జిల్లాకు చెందిన కలికోట వెంకటాచారి పెన్సీల్‌తో గీసిన ఈ ఆర్ట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. యర్రోజు చందు అనే వ్యక్తి ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షుకు ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. దాంతో ఆ పెన్సీల్ ఆర్ట్ ను హిమాన్షు చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభా నవ్వుతున్న పెయింటింగ్ ఫోటో వైరల్ గా మారింది. పలువురు ఆ పెయింగ్ ని చూసి హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleనితిన్ మరో కొత్త చిత్రం షురూ..ఆగస్టులో సెట్స్ పైకి మూవీ
Next articleవివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన చెడ్డ తల్లి కాదు