Home సినిమాలు వంటలక్క షాకింగ్ కామెంట్స్..తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ?

వంటలక్క షాకింగ్ కామెంట్స్..తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ?

156
0
Karthika Deepam Serial Fame Premi Viswanath Entry In Politics
Karthika Deepam Serial Fame Premi Viswanath Entry In Politics

తెలుగు రాష్ట్రాలలో వంటలక్క అంటే ఎక్కడలేని అభిమానం, ప్రేమానురాగాలు ఉన్నాయి. ప్రేమి విశ్వనాధ్ అయిన వంటలక్క గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అంతేకాకుండా ఈమె ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. స్టార్ హీరోలు, హీరోయిన్లకు కూడా దక్కని క్రేజ్ కార్తీకదీపం సీరియల్ తో దీప అందిపుచ్చుకుంది. ఎప్పుడూ సీరియల్ వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ..తాజాగా మరో విషయంపై వార్తల్లో నిలిచారు. అదేంటంటే ఈమె రాజకీయాల్లో రానున్నారు.

కేరళకు చెందిన ప్రేమీ విశ్వనాథ్ తన సొంత రాష్ట్రమైన కేరళ రాజకీయాలపై అంత ఆసక్తి చూపనని చెబుతూనే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అంటోంది. అయితే ఆమె సరదాగా చేసిన కామెంట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కార్తీకదీపం సీరియల్ లోకేషన్ కి  సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేస్తుండగా, తాజా వీడియోలో ప్రేమీ  విశ్వనాధ్,  ఈ సీరియల్ నిర్మాత గుప్తా వెంకటేశ్వరరావు సరదాగా ముచ్చట్లు పెట్టారు. వీరు సంభాషణ  మొదట కరోనా, లాక్డౌన్ దగ్గర మొదలై,  మెల్లగా పొలిటికల్ వైపు వెళ్లింది. కేరళ లో మా పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది అని చెప్పింది ప్రేమి విశ్వనాథ్.

నీకు నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అని అడిగారు నిర్మాత. ‘ఎమ్మెల్యే నా.. నాకు పొలిటికల్స్ ఇంట్రెస్ట్ లేదు సార్’ అని చెప్పింది వంటలక్క. కనీసం ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తావా? అని నిర్మాత అడగడంతో ..’హ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా’.. అని చెప్పింది వంటలక్క. మరి ఏ పార్టీలో చేరుతావని అడిగితే, అది చేరినప్పుడు చెప్తానంటూ  తెలివిగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read Also: AP News | TG News | Politics | International | National News | Sports | Covid 19

Previous articleచికెన్​ వల్ల బ్లాక్​ ఫంగస్..​వైరల్ అవుతోన్న ఫేక్ న్యూస్..నిజమెంత ?
Next articleరేపే ముహూర్తం ఫిక్స్..ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా ?