Home ఆంధ్ర ప్రదేశ్ కారా మాస్టారు కన్నుమూత..అస్తమించిన అక్షర సూరీడు

కారా మాస్టారు కన్నుమూత..అస్తమించిన అక్షర సూరీడు

169
0
kalipatnam ramarao master passed away
kalipatnam ramarao master passed away

ప్రముఖ సాహితీవేత్త కాళీపట్నం రామారావు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన సొంత నివాసంలో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సాహితీలోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కారా మాస్టారు గా పసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు 1924 నవంబరు 9 జన్మించారు. సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు.

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసాడు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంద్రనాథ్ రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. 

ఈయన చేసిన రచనలు తక్కువైనా సుప్రసిద్ధాలుగా పేరుపొందాయి. 1966లో ఈయన వ్రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించాడు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ద్వారా వచ్చిన డబ్బుతో పాటు, కొందరు సాహితీవేత్తల సహకారంతో 800 పుస్తకాలతో కథానిలయాన్ని ఆయన స్థాపించారు. ఇప్పుడు ఆ కథానిలయం లక్ష పుస్తకాలతో కళకళలాడుతోంది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleఆర్ఆర్ఆర్ కు ముందే రాజమౌళి షార్ట్ ఫిలిం..వారికి హ్యాట్సాఫ్ చెప్పనున్న టీమ్
Next articleటీఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్‌ రాజీనామా..ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు వెల్లడి