Home సినిమాలు Jathi Ratnalu:నక్కతోక తొక్కిన ‘జాతి రత్నాలు’ చిట్టి, భారీ చిత్రంలో ఛాన్స్

Jathi Ratnalu:నక్కతోక తొక్కిన ‘జాతి రత్నాలు’ చిట్టి, భారీ చిత్రంలో ఛాన్స్

203
0
Jathi Ratnalu
Jathi Ratnalu

లోకల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ‘జాతి రత్నాలు’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఒకే ఒక్క సినిమాతో ఊహించని రీతిలో పాపులర్ అయింది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఫరియా అబ్దుల్లా తాజాగా అదిరిపోయే ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. 

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నవీన్ పోలిశెట్టి హీరోగా.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘జాతి రత్నాలు’. అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ సినిమాను  నిర్మించాడు. ఫరియా అబ్దుల్లా ఈ చిత్రం ద్వారానే హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి మూవీతోనే ఈ బ్యూటీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఫరియా అబ్దుల్లా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీలో అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లలో తన ఇనోసెంట్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఫలితంగా ఈ బ్యూటీ తెలుగు కుర్రాళ్ల క్రష్‌ లిస్టులో చేరిపోయింది చెప్పుకోవచ్చు. 

Jathi Ratnalu

మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఫరియా అబ్దుల్లాకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ మూవీ తర్వాత ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఈ అమ్మాయి మాత్రం ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. అందుకోసమే ఇప్పటి వరకూ ఏ ప్రాజెక్టును ప్రకటించలేదు. కానీ, చాలా వరకు చర్చల దశలో ఉన్నాయట. సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. 

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఫరియా అబ్దుల్లా.. తన అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఆమె గ్లామర్ ట్రీట్ ఎక్కువగా ఇస్తోంది. తద్వారా తన అందాలతో కవ్విస్తోంది. అదే సమయంలో హాట్ డ్యాన్స్ వీడియోలను సైతం సోషల్ మీడియాలో వదులుతోంది. వీటితో పాటు సరికొత్త స్టైల్స్‌తో చేసిన రీల్స్‌ను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది.ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ సంబంధిత విశేషాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా రోజురోజుకూ తన ఫాలోవర్ల జాబితాను భారీగా పెంచుకుంటోంది.

 గత రెండు మూడు రోజులుగా ఫిలిం నగర్ ఏరియాలో ఫరియా అబ్దుల్లా గురించి ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. అదేమిటంటే.. ఈ బ్యూటీ తాజాగా ఓ భారీ ఆఫర్‌ను అందుకుందన్న వార్తే. అవును.. జాతి రత్నాలు చిట్టి భారీగా తెరకెక్కనున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా అవకాశాన్ని అందుకుందట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. బడా హీరో నుంచి రాబోతున్న ఓ సీక్వెల్‌లోనే ఫరియా అబ్దుల్లా ఛాన్స్ పట్టేసినట్లు తెలుస్తోంది. అందులో స్టార్ హీరో సరసన ఈ బ్యూటీ ఆడిపాడనుందని అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన మరింత సమాచారం మాత్రం బయటకు రాలేదు. దీంతో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు, హీరోల పేర్లను ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్.

Telugu latest Movie News

Previous articleఐదేళ్లు సహజీవనం.. గర్బవతిని చేసి ముఖం చాటేశాడు.. మాజీ మంత్రిపై హీరోయిన్ చాందిని సంచలన ఆరోపణలు
Next articleఆ హీరోతో నాలుగు రోజుల్లో ప్రేమలో పడ్డా..సీక్రెట్స్ బయటపెట్టిన జబర్దస్త్ అనసూయ