Home సినిమాలు నేను జబర్దస్ట్ షో చేయ్యకపోవటానికి కారణమిదే… సంచలన నిజాలను బయటపెట్టిన గెటప్ శ్రీను

నేను జబర్దస్ట్ షో చేయ్యకపోవటానికి కారణమిదే… సంచలన నిజాలను బయటపెట్టిన గెటప్ శ్రీను

155
0
Jabardast Getup Sreenu News

Jabardast Getup Sreenu News: బుల్లి తెరపై విశేష ప్రేక్షకాదరణ పొందిన వాటిలో జబర్దస్త్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తమదైన కామెడీ టైమింగ్ తో పంచులతో ఎంతో మంది నటులు ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తారు.ఇలా బుల్లి తెరపై స్టార్ స్టేటస్ పొంది, సినిమాల్లో కూడా రాణిస్తూ ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేకమైన స్థానం పొందారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరోలుగాను ప్రస్తానం ప్రారంభించారు. ఇలా సినిమాలు చేస్తున్నా, తమకు గుర్తింపునిచ్చిన జబర్దస్త్ ను వారు విడిచిపెట్టలేదు. 

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ వంటి వారు ఈ కోవలోకే వస్తారు. వీరు ముగ్గురు “త్రి మంకీస్” ద్వారా హీరోలుగా నటించినప్పటికీ, సుధీర్ సోలో హీరోగా సాఫ్టువేరు సుధీర్ సినిమాతో వెండితెరపైనా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే కోవలో గెటప్ శ్రీను కూడా సోలో హీరోగా రాణించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. రాజు యాదవ్ పేరుతో గెటప్ శ్రీను సోలో హీరోగా  రానున్న సినిమా కు సంబంధించి సోషల్ మీడియా లో పోస్టర్లు, టీజర్ వంటివి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమా విషయంలో కొంచెం బిజయ్ కావడం తో ఇటీవల కాలంలో బుల్లి తెరపై గెటప్ శ్రీను దర్శనమివ్వలేదు.

getup Sreenu

శ్రీ దేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి షోలలో గెటప్ శ్రీను కనిపించకపోవడంతో ప్రేక్షకుల్లో పలు అనుమానాలు రేకెత్తాయి. ఇక సోషల్ మీడియాలో కొంత మందైతే జబర్దస్త్ షో కు గెటప్ శ్రీను గుడ్ బై చెప్పేశాడని పోస్టులు హోరెతించారు. అయితే తాను జబర్దస్త్ లో కనపడక పోవడానికి కారణం వేరే ఉందంటూ అసలు విషయం ఎట్టకేలకు సోషల్ మీడియా లో చెప్పకనే చెప్పేశారు గెటప్ శ్రీను. తనపై సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ అసలు కారణాన్ని పోస్టు రూపంలో తెలియజేశారు. 

‘అందరికీ నమస్కారం.. మూవీ షూట్ అయిన తరువాత మా టీంలో కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.. నేను టెస్ట్ చేసుకోగా నెగెటివ్ వచ్చింది. కానీ కొన్ని రోజులు బయటకు రాకూడదని, హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఆ టైంలో జబర్దస్త్ షూటింగ్‌కి వెళ్లడం కుదరలేదు.. మరల 18వ తేదీన శుక్రవారం మన షోలో కలుద్దాం. మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ మీ గెటప్’ అంటూ అసలు గుట్టు విప్పారు గెటప్ శ్రీను.

Read Also:

టీతో కలిపి వీటిని అస్సలు తీసుకోకూడడు అవి ఏమిటంటే..?

బాలీవుడ్ వైపు పూరి చూపు

దసరా ధమాక అక్టోబర్ 15న ఐపీఎల్ ఫైనల్

కరీంనగర్ లో పాము నుంచి వింత అరుపులు..భయం భయంగా స్థానికులు

Previous articleకాఫీ తాగే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే
Next articleవరుడు అరగంటలో తాళి కడతాడు …కానీ పెళ్లి కూతురు చేసిన పనికి ఊరంతా షాక్