Home జాతీయ వార్తలు స్కిన్ బ్లాక్ ఫంగస్ కలకలం..దేశంలో తొలి కేసు నమోదు

స్కిన్ బ్లాక్ ఫంగస్ కలకలం..దేశంలో తొలి కేసు నమోదు

219
1
India First Black Fungus Found On Skin In Covid Patient
India First Black Fungus Found On Skin In Covid Patient

కరోనాతో దేశం విలవిల్లాడుతోంది. దానికి తోడు ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ కేసులు నమోదవడమే కాదు కేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు మరో ఫంగస్ దూసుకురావడం అందర్నీ భయాందోళనకు గురిచేస్తోంది.

దేశంలో మొదటి సారిగా కర్ణాటకలో స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. చిత్రదుర్గలో ఈ కేసు నమోదు అవ్వడం కలకలం రేపుతోంది. ఈ ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి స్కిన్ బ్లాక్ గా మారింది. దానిని మ్యూకోయిడ్ మైకోసిస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 

స్కిన్ బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తి ఒక నెల ముందు కరోనా వచ్చి చికిత్స తీసుకున్నాడు. అప్పటికే ఆయనకు మధుమేహ వ్యాధి ఉండటం వల్ల అతడి చెవి వద్ద స్కిన్ బ్లాక్ గా మారిపోయింది. బాధితుడి కుడి చెవి దగ్గర చర్మంలో బ్లాక్ ఫంగస్ ఉందని డాక్టర్లు నిర్దారించారు. వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసి బ్లాక్ ఫంగస్ ను తొలగించారు. అయితే మరో దశ ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 

Read Also: ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ తెలంగాణా న్యూస్ అంతర్జాతీయ వార్తలు జాతీయ వార్తలు కోవిడ్ 19 న్యూస్

Previous articleఇంటి వద్దకే ఆనందయ్య మందు..ఆన్ లైన్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు
Next articleట్యాబ్లెట్లను ఇలా వేసుకుంటే సేఫ్..జాగ్రత్తలివే