Home సినిమాలు ఆ హీరోతో నాలుగు రోజుల్లో ప్రేమలో పడ్డా..సీక్రెట్స్ బయటపెట్టిన జబర్దస్త్ అనసూయ

ఆ హీరోతో నాలుగు రోజుల్లో ప్రేమలో పడ్డా..సీక్రెట్స్ బయటపెట్టిన జబర్దస్త్ అనసూయ

196
0

అనసూయ…జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయమైన చాలా క్రేజ్ సంపాదించుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా సరే తన నిత్య నూతన అందంతో ఆమె కుర్రాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటుంది. తనకు టెలివిజన్ లో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. అయితే అవకాశం వచ్చిన అన్ని పాత్రలు చేయకుండా తనకు నచ్చిన పాత్రలు మాత్రమే ఈ భామ చేస్తూ ఉంటుంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రిలీజైన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమె మరింత క్రేజ్ సంపాదించింది. భర్తను కోల్పోయినా ఏ మాత్రం ఆ విషయం బయటపడకుండా అందరితో కలుపుగోలుగా ఉండే మహిళ పాత్రలో నటించి చివర్లో ఏడిపించేసింది. మరి అంతటి టాలెంట్ ఉంది కాబట్టే అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

I fell in love with that hero in four days..Jabardast Anasuya who revealed the secrets

సుకుమార్ కు రంగమ్మత్త పాత్రలో అనసూయ నటన నచ్చడంతో ఈ హాట్ యాంకర్ కి మళ్ళీ పుష్ప సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే ఈ భామ షూట్ కి కేవలం నాలుగు రోజులే వెళ్లిందట. ఆ తరువాత కరోనా కారణంగా షూట్ ఆగిపోయిందట. అయితే పుష్పా షూట్ విషయాలను ఒక తాజా ఇంటర్వ్యూలో పంచుకున్న ఈ భామ కేవలం నాలుగు రోజుల్లో, అల్లు అర్జున్‌తో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది. ఆయనకు పని పట్ల ఉన్న నిబద్ధత మరియు అంకితభావం చూసి తాను ఫిదా అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది.

jabardast Anasuya

అల్లు అర్జున్‌ను బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్న ఆమె ఆయనకు ఎంత పేరు, ఫేం ఉన్నప్పటికీ, తన మొదటి సినిమా కోసం ఎంత కష్ట పడుతున్నాడో ఈ సినిమాకి కూడా అంతే కష్టపడుతున్నాడు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అల్లు అర్జున్ పాత్రతో ప్రేక్షకులు అసలు సూపర్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇంతలో, ఆమె తన పాత్ర గురించి పెద్దగా వెల్లడించలేదు, కానీ అనసూయ మాట్లాడుతూ తన పాత్ర ఆశ్చర్యకరంగా ఉంటుందని వెల్లడించింది.మేకప్ వేసుకుని చేయాల్సిన పాత్రను ఒక రకంగా డీ గ్లామర్ గా చూపారని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే ఇక రంగమ్మత్త పాత్ర గురించి మాట్లాడుతూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతే కాక రామ్ చరణ్ తో నన్ను రంగమ్మక్క లేదా రంగమ్మ అని పిలిపించవచ్చు కదా అని ముందు అనిపించిందని కానీ తనకు ముందు పాత్ర నచ్చకపోయినా ఆ పాత్ర తనకు మంచి పేరు తెచ్చిందని ఆమె చెప్పారు.

Latest cinema news in telugu

Previous articleJathi Ratnalu:నక్కతోక తొక్కిన ‘జాతి రత్నాలు’ చిట్టి, భారీ చిత్రంలో ఛాన్స్
Next articleసత్యయుగం వచ్చిందంటున్న ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్