Home జాతీయ వార్తలు వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడండిలా

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడండిలా

204
0
How To View Deleted Messages In Whatsapp
How To View Deleted Messages In Whatsapp

వాట్సాప్ అనేది ఇప్పుడు చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ వినియోగిస్తున్న యాప్. ఈ చాటింగ్ యాప్ ద్వారా లాక్ డౌన్ లో చాలా మంది కాలక్షేపం చేస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో దీనిపై రకరకాల వార్తలు వచ్చాయి. ప్రైవసీ విషయంలో వాట్సాప్ కొన్ని షరతులు పెట్టింది. దానిపై కేంద్రానికి వాట్సాప్ కు మధ్య వార్ కూడా నడుస్తోంది. కొన్ని విషయాలలో వాట్సాప్ తగ్గినప్పటికీ మరికొన్ని ఫీచర్సు మార్చడానికి మాత్రం కేంద్రం ఒప్పుకోవడం లేదు. ఇటువంటి టైంలో వాట్సాప్ యూజర్ల శ్రేయస్సు కోసం ఫీచర్స్ ను తీసుకొస్తోంది. తాజాగా వాట్సాప్ తన యూజర్లకు అనేక ఫీచర్స్ తీసుకొస్తూ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగా సాధారణంగా వాట్సాప్ లో ఒకసారి డిలీట్ చేసిన మెస్సేజులు మళ్లీ మళ్లీ చూసుకోలేము. 

అయితే ఇకప్పై ఆ డిలీట్ చేసిన మెస్సేజులను కూడా చూసుకునే యాప్ ఒకటి మన ముందుకు వచ్చింది. దీని కోసం మొదట గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లాలి. గూగుల్ ప్లే స్టోర్ లో Notisave యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అవసరమైన అన్ని పర్మిషన్లను అనుమతించాలి. ఆటో-స్టార్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత వాట్సాప్ లో పంపిన ప్రతీ ఫోటోలు, ఫైల్‌లు, మీడియాతో సహా NotiSave యాక్సస్ చేయబడుతుంది.

అప్పటినుంచి మీరు అందుకున్న అన్ని నోటిఫికేషన్‌లు, వాట్సాప్ మెసేజ్ లను యాప్ ట్రాక్ చేస్తుంది. ఆ తరువాత, పంపినవారు సందేశాన్ని డిలీట్ చేసినా మీరు నోటిసేవ్ యాప్ ద్వారా చదవొచ్చు. మీరు అనుకోకుండా లేదా అనుకోకుండా స్వైప్ చేసిన నోటిఫికేషన్‌లను కూడా మీరు చదవవచ్చు. ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. iOS యూజర్లకు ఇది పనిచేయదు. whatsapp news

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleలాక్ డౌన్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు..రోడ్డుపై కనిపిస్తే ఐసోలేషన్ కు తరలింపు
Next articleఏపీలో భారీగా వాలంటీర్ ఉద్యోగాలు..దరఖాస్తుకు రేపే ఆఖరు తేది