Home సినిమాలు నితిన్ మరో కొత్త చిత్రం షురూ..ఆగస్టులో సెట్స్ పైకి మూవీ

నితిన్ మరో కొత్త చిత్రం షురూ..ఆగస్టులో సెట్స్ పైకి మూవీ

108
0
Hero Nithin Latest Movie Starts From August
Hero Nithin Latest Movie Starts From August

టాలీవుడ్ లో హీరో నితిన్ కు ఓ లెవల్లో ఫాలోయింగ్ ఉంది. పవర్ స్టార్ అభిమానినంటూ నితిన్ చెప్పడంతో చాలా మంది ఆయన అభిమానులైపోయారు. తాజాగా నితిన్ ఓ కొత్త సినిమాను స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం. భీష్మ సినిమాతో విజయాన్ని అందుకున్న నితిన్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా చెక్, రంగ్ దే సినిమాలు చేశాడు. అయితే ఆ సినిమాలు థియేటర్లలో అంతగా ఆడలేదు. అయినా కానీ డిఫరెంట్ మూవీతో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ ‘అంధాదున్’ తెలుగు రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు. 

మాస్ట్రో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మేర్లపాక గాంధీ డైరక్షన్ చేస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్ తమన్నా ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇక ‘పవర్ పేట’ ప్రాజెక్ట్ చేతిలో ఉండగానే దర్శక, రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఓ మూవీకి పచ్చపెండా ఊపాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. అయితే ఆగస్టు నుంచి సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతోంది. దీనికి సంబంధించి అప్ డేట్ త్వరలోనే రానుంది.

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleవ్యాక్సిన్ వేసుకుంటే బీరు ఫ్రీ..ఎక్కడంటే?
Next articleనెట్టింట్లో సీఎం కేసీఆర్ దంపతుల ఫోటో..ట్వీట్ చేసిన మనమడు హిమాన్షు..వైరలవుతోన్న పెయింటింగ్