Home ఆరోగ్యం ఈ టెస్ట్‌తో గుండెనొప్పి గురించి ముందే తెలుసుకోవచ్చు..ఆ టెస్ట్ ఏంటంటే

ఈ టెస్ట్‌తో గుండెనొప్పి గురించి ముందే తెలుసుకోవచ్చు..ఆ టెస్ట్ ఏంటంటే

144
0
Heart Disease Checking Test
Heart Disease Checking Test

ఈ మధ్య కాలంలో చాలా మందికి గుండె సంబంధిత వ్యాధులనేవి ఎక్కువవుతున్నాయి. మంచి ఆహారం తీసుకోకపోవడం, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇటువంటి సమస్యలనేవి దాపురిస్తున్నాయి. అయితే గుండెనొప్పి రావడం అనేది మనం ముందే తెలుసుకోవచ్చు. ఓ టెస్టు చేయడం వల్ల హార్ట్ ఎటాక్ ను ముందే గుర్తించవచ్చు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

కాల్షియం స్కోర్ టెస్ట్ అనేది డైరెక్ట్ విజువలైజేషన్ ను మన కళ్లముందు ఉంచుతుంది. కరోనరీ ఆర్టెరీస్ లో క్యాల్షియం ఏ స్థాయిలో ఉందో ఇట్టే చెప్పేస్తుంది. గుండె నొప్పి సమస్యలు, వాటిల్లే ప్రమాదాలు ఇలా ఎన్నో రకాల విషయాలను ఈ టెస్టు ద్వారా మనం ముందే గుర్తించవచ్చు. సాధారణంగా రక్తప్రసరణ సమయంలో హార్ట్ బ్లాక్ అయితే గుండె నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో కొలెస్ట్రాలు స్థాయి పెరగడం వలన బ్లాకేజ్ ఏర్పాటు అవుతుంది. ఆ తర్వాత గుండె నొప్పి వస్తుంది. గుండె నొప్పితో చాలా మంది కన్నుమూస్తుంటారు. అందుకే ఆ సమస్యను అధికమించాలంటే ఇటువంటి టెస్టులు చేసుకోవడం ఎంతో ఉత్తమం.

Heart Disease Checkup

రోజూవారీ వైద్య చికిత్సకు సంబంధించి టెస్టులు చేసుకోవడం, పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తినడం ద్వారా అనేక సమస్యలను పోగొట్టుకోవచ్చు. గుండెపోటును ముందే గుర్తించడంలో క్యాల్షియమ్ స్కోర్ టెస్టు అనేది ఓ కొత్త వినూత్న పద్దతిగా భావించవచ్చు. ఈ టెస్టు ద్వారా హార్ట్ ఎటాక్ ను ముందే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరీక్ష ద్వారా వైద్యులు కొన్ని విషయాలను తెలుసుకోవచ్చని తెలిపారు. కరొనరి ఆర్టెరీలో క్యాల్షియం లెవల్సు తెలుసుకోవచ్చు. 

విజువలైజేషన్ ద్వారానే ఆర్టెరీస్ లో కాల్షియమ్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఆ టెస్టులో జీరో స్కోరు కనుక వచ్చి ఉన్నట్లైతే క్యాల్షియమ్ లేదని గ్రహించాలి. ఎక్కువ స్కోర్ ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. స్కోరు వంద నుంచి మూడు వందల వరకూ ఉన్నట్లైతే మోడరేట్ రిస్క ఉన్నట్లు గ్రహించాలి. 400 పైగా ఉంటే బ్లాక్ రిస్క్ ఉందని గ్రహించాలి. కాబట్టి ఈ పరీక్ష చేయించుకోవడం ఎంతో మంచిది. ఈ టెస్టు ద్వారా ముందుగానే గుండె నొప్పి వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఆ సమస్య రాకుండా చేసుకోవచ్చు. 

Read Also: AP News | TG News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleరేపే ముహూర్తం ఫిక్స్..ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా ?
Next articleవ్యాక్సిన్ వేసుకో..బీరు అందుకో