Home రాజకీయం గ్యాస్ సిలిండర్ వాడేవారికి గుడ్ న్యూస్..భారీగా తగ్గిన ధర ఏంటంటే..?

గ్యాస్ సిలిండర్ వాడేవారికి గుడ్ న్యూస్..భారీగా తగ్గిన ధర ఏంటంటే..?

137
0
Govt Good News For LPG Cylinder Users

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు తగ్గడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూ..లాంటివి పాటిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలను చూసి సతమతమైపోతున్నారు. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ వాడేవారికి ఓ తీపికబురు అందింది.

జూన్ నెల మొదటి రోజే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించారు. నేటి నుంచే ఆ ధరలు అమల్లోకి రానున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తగ్గించిన ఆ ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను ఐఓసీ రూ.122 తగ్గించింది. తగ్గిన ధరల ప్రకారంగా చూస్తే ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1473కు చేరింది. గత నెలలో కూడా రూ.45 వరకూ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. దీంతో ముంబైలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1422కు చేరింది.

కోల్‌కతాలో రూ.1544కు, చెన్నైలో రూ.1603కు గ్యాస్ సిలిండర్ ధర చేరింది. అయితే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించలేదు. ఆ ధరలో ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.809, కోల్‌కతాలో రూ.835, ముంబైలో రూ.809, చెన్నైలో రూ.825లకు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయడం జరుగుతోంది.

Previous articleకిలేడీ డాక్టర్..పసిబిడ్డను రూ.16 లక్షలకు బేరం..అసలు విషయం తెలిసి పోలీసులే షాక్
Next articleవారికి తీపికబురు చెప్పిన సీఎం.. ఇకపై ఇంటికే మద్యం