Home సినిమాలు స్టార్ సింగర్ ఘంటసాల ఇంట్లో తీవ్ర విషాదం శోక సంద్రం లో సినీ పరిశ్రమ

స్టార్ సింగర్ ఘంటసాల ఇంట్లో తీవ్ర విషాదం శోక సంద్రం లో సినీ పరిశ్రమ

170
0
Ghantasaala Son Is Nomore
Ghantasaala Son Is Nomore

Ghantasala Son: ఎన్నో సుమధుర గీతాలతో తెలుగు వారి మదిలో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రముఖ గాయకులు దివంగత ఘంటసాల వెంకటేశ్వర రావు.. ఇక ఆయన బాటలోనే సినీ గాయకునిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. కరోనా నుంచి ఇటీవలే ఆయన కోలుకున్నారు. అయితే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాశ విడిచారు. ఆయన కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా డయాలిసిస్ చేయించుకుంటున్నారు. ఆయన మరణం తో వారి కుటుంబం తో పాటు చిత్ర సీమలో తీరని విషాద చాయలు నెలకొన్నాయి.

ఘంటసాల వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ ఇండస్ట్రీలో ప్రవేశించిన దక్షిణాదిలో ఎన్నో భాషలతో పాటు బాలీవుడ్ లోను తన సేవలు అందించారు. ఇక ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ రత్న కుమార్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎనిమిది గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పిన రికార్డు ఆయన సొంతం. ఇలా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో సుమారు వెయ్యికి పైగా డబ్బింగ్ చెప్పడంతో  పాటు కొన్ని చిత్రాలకు మాటలు కూడా అందించిన ఘనత ఆయనకు ఉంది.

Read Also:

టీతో కలిపి వీటిని అస్సలు తీసుకోకూడడు అవి ఏమిటంటే..?

బాలీవుడ్ వైపు పూరి చూపు

దసరా ధమాక అక్టోబర్ 15న ఐపీఎల్ ఫైనల్

కరీంనగర్ లో పాము నుంచి వింత అరుపులు..భయం భయంగా స్థానికులు

Previous articleటీతో కలిపి వీటిని అస్సలు తీసుకోకూడడు అవి ఏమిటంటే..?
Next articleనేడు ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం.. గర్భిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..